తెలంగాణ

మంచినీటికి ఇబ్బంది రానివ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 1: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. వేసవిలో తాగునీటి పరిస్థితిపై జిల్లాల యంత్రాంగాలతో ఆయన సమీక్ష ప్రారంభించారు. శనివారం జరిపిన సమావేశంలో రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, నల్లగొండ జిల్లాల్లో తాగునీటి పరిస్థితిపై సమీక్షించారు. ఎట్టి పరిస్థితిల్లోనూ తాగునీటికి ఇబ్బంది కలగకుండా చూడాలని, ఇందుకోసం ఎన్ని నిధులు అవసరమైనా ఇస్తామని హామీ ఇచ్చారు. అద్దెబోర్లు, వాటర్ ట్యాంకర్లకు చెల్లించాల్సిన బకాయిలను వారంలోగా చెల్లిస్తామని వివరించారు. రానున్న మూడు నెలల పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు జాగ్రత్తగా పనిచేయాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, అంజయ్యయాదవ్, రాంమోహన్‌రెడ్డి, సంజీవరావు, రవికుమార్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.