ఆంధ్రప్రదేశ్‌

రెండు వారాలు ఆగాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 2: మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ సచివాలయంలోని ఛాంబర్లలో ఆశీనులయ్యేందుకు ఆరుగురు రెండు వారాలు ఆగాల్సిందే. వెలగపూడి సచిలాయంలోని నాలుగు బ్లాక్‌లలో 19 మంది మంత్రులకు ఛాంబర్లు కేటాయించారు. కానీ భవిష్యత్తులో మరింత మంది మంత్రులకు ఛాంబర్లు ఏర్పాటుచేయాల్సి వస్తుందన్న ఆలోచన లేకపోవడంతో కొత్త మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు సమస్యగా మారింది. వివిధ బ్లాకుల్లోని కాన్ఫరెన్స్ హాళ్లు ఆరింటిని కొత్త మంత్రులకు ఛాంబర్లుగా మార్చుతున్నారు. ఇందుకు రెండు వారాల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. యుద్ధప్రాతిపదికన ఛాంబర్లను సిద్ధం చేయాలని సిఆర్‌డిఏ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.