ఆంధ్రప్రదేశ్‌

ఆందోళన బాటలో వైకాపా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఫిరాయింపుదార్లకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించడాన్ని నిరసిస్తూ వైకాపా ఈనెల 7న రాష్టవ్య్రాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది. ఈ విషయాన్ని వైకాపా ఎంపి వైవి సుబ్బారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని గౌరవించే అన్ని పార్టీలు, మేధావులు, ప్రజలు, ప్రజాసంఘాలు కలిసి రావాలని, టిడిపి అనైతిక చర్యలను నిరసించాలని కోరారు. రెండు మూడు రోజుల్లో చంద్రబాబు అనైతిక విధానాలను రాష్టప్రతి, ప్రధానమంత్రి, జాతీయ పార్టీల నేతలను కలిసి వివరించనున్నట్లు ఆయన చెప్పారు. ఏపిలో జరుగుతున్న పరిణామాలను ఢిల్లీలో అన్ని పార్టీల నేతలకు తెలియచేస్తామన్నారు. పార్లమెంటు సమావేశాల్లో కూడా రాష్ట్రంలో నెలకొన్న రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ఎండగడుతామన్నారు.