ఆంధ్రప్రదేశ్‌

కమీషన్ల కోసమే ప్యాకేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 8: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలని పట్టుపట్టిన చంద్రబాబు, హోదా కాదని ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ జపం చేస్తున్నది కమీషన్ల కోసమేనని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, ఎంపి దిగ్విజయ్‌సింగ్ ధ్వజమెత్తారు. నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నగరంలోని బీసెంట్ రోడ్డులో ప్రత్యేక హోదాపై నిర్వహించిన ప్రజా బ్యాలెట్ కార్యక్రమంలో ప్రజాభిప్రాయలను స్వీకరించిన దిగ్విజయ్‌సింగ్ మాట్లాడుతూ చంద్రబాబు తన రాజకీయ స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను కాలరాసిన వైనం గర్హనీయమన్నారు. హోదాలేకుండా నవ్యాంద్ర అభివృద్ధి ఎలా సాధ్యపడుతుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్భ్రావృద్ధిని తాకట్టు పెట్టిన చంద్రబాబు కమీషన్ల కోసమే ప్యాకేజీని భుజాన వేసుకొన్నాడని ఎద్దేవా చేసారు. హోదా సాధించే వరకూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలోనే కాక జాతీయ స్థాయిలో కూడా పోరాడుతుందన్నారు. కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ సెల్ చైర్మన్ కొప్పల రాజా మాట్లాడుతూ ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని తెలిసినా హోదా కాదని, ప్రత్యేక ప్యాకేజీకే ప్రాధాన్యత ఇచ్చిన టిడిపి పాలకులకు ప్రజలే గుణపాఠం చెప్పాలన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలు చేస్తునే ఉంటుందన్నారు. ప్రత్యేక హోదా కావాలా వద్దా అనే విషయంతోపాటు గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన 600 వాగ్దానాల అమలుపై నిర్వహించిన ప్రజా బ్యాలెట్ కార్యక్రమంలో దిగ్విజయ్‌సింగ్, రఘువీరారెడ్డి, కెవిపి రామచ్రందరావు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు, గిడుగు రుద్రరాజు, జంగా గౌతమ్, టిజెఆర్ సుధాకర్ బాబు, తదితరులు బ్యాలెట్ బాక్సులు పట్టుకొని బీసెంట్ రోడ్డులో తిరుగుతూ ప్రజాభిప్రాయాలను స్వీకరించారు.
చర్చనీయాంశమైన చిరంజీవి గైర్హాజరు
ఎపిసిసి ఆధ్వర్యంలో నగరంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కో అర్డినేషన్ మీటింగ్‌కు కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. స్థానిక ఆంద్రరత్నభవన్‌లో జరిగిన ఈ సమావేశానికి ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్, సీనియర్ నేత కుంతియా లతోపాటు పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి తదితర అగ్రనేతలు పాల్గొన్నారు. అయితే చిరంజీవి రాకపోవడంపై ఇటు పార్టీ నేతలతోపాటు కిందిస్థాయి శ్రేణుల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. కాగా ఆ నోటా ఈనోటా మాటా మాటా పెరగడంతో కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు ఈవిషయంపై స్పందించాల్సి వచ్చింది. చిరంజీవి కాంగ్రెస్‌లోనే కొనసాగుతారంటూ మీడియా చిట్‌చాట్‌లో స్పష్టం చేయడంతో చర్చలు, ఊహాగానాలు సద్దుమణిగాయి.

చిత్రం..ప్రజాబ్యాలెట్ నిర్వహిస్తున్న దిగ్విజయ్ సింగ్, రఘువీరారెడ్డి, కెవిపి తదితరులు