ఆంధ్రప్రదేశ్‌

అన్ని హంగులతో టిడిపి కార్యాలయం రెడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 22: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని గుంటూరులో సర్వ హంగులతో సిద్ధం చేస్తున్నారు. వచ్చే నెలలో ఇక్కడి నుంచి పార్టీ సమావేశాలు నిర్వహించాలని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ముందుగా నిర్దేశించిన ప్రకారం ఉగాది పండుగ రోజునే హైదరాబాద్ నుండి రాష్ట్ర కార్యాలయాన్ని తరలించాల్సి ఉంది. అయితే ఇంకా ఏర్పాట్లు పూర్తికానందున 29న ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు గుంటూరు జిల్లా పార్టీ కార్యక్రమాలను ఈ కార్యాలయం నుంచి నిర్వహించారు. ఈ భవనానే్న రాష్ట్ర పార్టీ కార్యాలయంగా ఎంపిక చేయడంతో జిల్లా పార్టీ కార్యాలయం కోసం నాయకులు మరో భవనాన్ని అనే్వషిస్తున్నారు. సువిశాలమైన ప్రాంగణంలో నిర్మితమైన టిడిపి కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్‌లో సభలు, సమావేశాలు జరుపుకునేందుకు వీలుగా సుమారు రూ.10లక్షల వ్యయంతో సెంట్రల్ ఏసి, ఫర్నిచర్‌ను అమర్చుతున్నారు. మొదటి ఫ్లోర్‌లో వివివి చౌదరి, తొండెపు దశరథ జనార్ధన్ క్యాబిన్లతో పాటు మరో ఆరు క్యాబిన్లను అదనంగా ఏర్పాటు చేస్తున్నారు. రాష్టస్థ్రాయి గ్రంథాలయం, సమాచార కేంద్రం, ప్రజాసంబంధాలు, మీడియా సెంటర్, తదితర విభాగాలకు అవసరమైన వసతులు కల్పిస్తున్నారు. ఇందుకోసం మరో రూ.10 లక్షలకు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. రెండో ఫ్లోర్‌లో పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోసం ప్రత్యేక ఛాంబర్లను మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. కార్యాలయానికి నైరుతి దిక్కున ఉన్న టాయిలెట్లను తొలగించి వాటి స్థానంలో అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తున్నారు. కార్యాలయ పనులు పూర్తయిన మరుక్షణం నుంచి రాష్ట్ర పార్టీ, పొలిట్‌బ్యూరో సమావేశాలు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు గత ఏడాదిన్నర కాలంగా పార్టీ సమావేశాలను విజయవాడలోని ఏ-వన్ కనె్వన్షన్ సెంటర్‌లో జరుపుతున్నారు. దీనివల్ల దూరప్రాంతాల నుంచి వచ్చే పార్టీ నాయకులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర కార్యాలయ స్థాయికి తగ్గట్టుగా కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయానికి తగిన స్థలం లేదు. దీంతో ‘నాక్’ కల్యాణ మండపంలో తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని భావించినా అందుకు తగిన వనరులు లేకపోవడంతో అన్నివిధాలా గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయం అనువుగా ఉన్నందున రాష్ట్ర పార్టీ కార్యాలయంగా ఖరారు చేశారు. ఆగస్టులో కృష్ణా పుష్కరాలు వస్తున్నందున సుముహూర్తాలు లేకపోవడంతో ఈలోపు కార్యాలయంలో ప్రవేశించి ఓ విడత సమావేశం నిర్వహిస్తే మంచిదని పార్టీ అధినేత చంద్రబాబుకు పలువురు నేతలు సూచించినట్లు సమాచారం.