ఆంధ్రప్రదేశ్‌

ఒకే గొడుగు కిందికి సంక్షేమ శాఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 13: వెనుకబడిన తరగతుల సంక్షేమ పథకాల అమలు తీరును తానే స్వయంగా పరిశీలిస్తానని, అందుకోసం త్వరలో బిసి ఫెడరేషన్లలో సమర్థవంతంగా పనిచేసిన వందమందిని స్వయంగా కలవనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. వెనుకబడిన తరగతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన గత ప్రభుత్వాల మాదిరిగా తమ ప్రభుత్వం పనిచేయదన్నారు. తమ ప్రభుత్వం మూడేళ్లలోనే బిసిల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి, గత ప్రభుత్వాలు దశాబ్దకాలంలో ఖర్చుచేసిన దానికంటే రెట్టింపు మొత్తం ఖర్చుచేసిన విషయాన్ని గుర్తుచేశారు. గురువారం తన కార్యాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. 2004 నుంచి 2014 వరకు 60.95 లక్షల మంది విద్యార్థులకు రూ.6727.72 కోట్ల రూపాయలు స్కాలర్‌షిప్‌గా ఇస్తే గడచిన మూడేళ్లలో 26.35 లక్షల మంది విద్యార్థులకు రూ.6326.00 కోట్లు కేటాయించామని, తెలుగుదేశం పార్టీ బిసిల పక్షపాతి అని రుజువైందని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. గత ఆర్థిక సంవత్సరంలోనే 10 లక్షల మంది విద్యార్థులకు రూ.2593 కోట్లు అందించామని చెప్పారు. వెనుకబడిన తరగతులకు గతం కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అందిస్తున్నా అవి సరిపోవని, వచ్చే రెండేళ్లలో మరిన్ని అర్థవంతమైన సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. బిసి, ఎస్సీ, ఎస్సీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ వంటి సంక్షేమ శాఖలన్నీ ఒకే గొడుగు కిందికి రావాల్సిన ఆవశ్యకత ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలంటే డబ్బు పంపిణీ కాదన్న సిఎం, వాటివల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరిగి యువత జీవితంలో స్థిరపడాలన్నారు. సంక్షేమ శాఖల అధికారులు, బ్యాంకర్లు సమావేశమై అందుకు తగినవిధంగా కార్యాచరణ తయారుచేసి, ప్రతి మూడు నెలలకోసారి గ్రౌండింగ్ రిపోర్ట్ తనకు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి సద్వినియోగమయ్యేలా చూడాలన్నారు. ప్రభుత్వం అందించే చేయూత వారికి జీవితాతం ఉపయోగపడాలన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో బయోమెట్రిక్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. వెనుకబడిన తరగతుల్లో ఉన్న 139 కులాల అభివృద్ధికి 11 ఫెడరేషన్లు ఏర్పాటుచేసిన విషయం గమనంలో ఉంచుకోవాలని కోరారు. వెనుకబడిన సామాజిక వర్గాల్లో ప్రతి కులంలో జనాభా వివరాలు తీసుకుని విశే్లషించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వారిలో ఎందరు కులవృత్తుల్లో ఉన్నారు, ఇతర వృత్తులు చేపట్టినవారు ఎందరు అనే సమాచారం సేకరించాలని, అప్పుడే సంక్షేమ కార్యక్రమాల అమలులో మరింత స్పష్టత వస్తుందన్నారు. కులవృత్తుల్లో ఉన్నవారి నైపుణ్యాలు గుర్తించి అవసరమైన నైపుణ్యాభివృద్ధి చేసి ఉపాధిని మెరుగుపరిచేందుకు యూనిట్లు మంజూరు చేయాలని కోరారు. చేనేత కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆ రంగంలో నూతన ఆవిష్కరణలు జరగాలని, చేనేత కార్మికుల్లో పెద్దఎత్తున నైపుణ్యాభివృద్ధి జరగాలని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మేళవింపుతో వారికి మేలు జరగాలని, ఇందుకు తక్షణమే కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.