ఆంధ్రప్రదేశ్‌

ఆచార్య ఆత్రేయ సతీమణి కిళాంబి పద్మావతి కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 22: ప్రముఖ కవి, సినీ గేయ రచయిత ఆచార్య ఆత్రేయ భార్య కిళాంబి ఉత్సూరు పద్మావతి ఆత్రేయ (90) శుక్రవారం కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లముదునూరుపాడులోని ఆమె సోదరి వింజమూరి మధురవల్లి ఇంట్లో ఆమె కన్నుమూశారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం మంగళంపాడుకు చెందిన ఆచార్య ఆత్రేయను కిళాంబి వివాహం చేసుకున్నారు. వీరికి పిల్లలు లేరు. 1989లో ఆత్రేయ మరణం తర్వాత కిళాంబి పద్మావతి ఆమె సోదరి మధురవల్లి ఇంటి వద్ద ఉంటున్నారు. కిళాంబి సంస్కృతం, హిందీ, తమిళం భాషల్లో ప్రావీణ్యురాలు. ఆయా భాషల్లో ఎన్నో రచనలు చేశారు. చిత్రసీమలో ఎంతోమంది సినీ ప్రముఖులు ఆమె రచనలను మెచ్చి ప్రశంసించారు. ఆచార్య ఆత్రేయ సాధించిన ప్రతి విజయం వెనుక కిళాంబి ఉండేవారు. భాషాప్రావీణ్యంలో కిళాంబిని మెచ్చి విజయనగరం రాజులు ఘనంగా సత్కరించారు. ఆత్రేయ, కిళాంబి దంపతులకు పిల్లలు లేకపోవడంతో, సోదరి పిల్లలైన రంగనాధ్, వైజయంతిలను కన్నబిడ్డలుగా చూసుకునేవారు.