ఆంధ్రప్రదేశ్‌

ఏఒబిలో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఏప్రిల్ 14: వారం రోజులుగా ఎఒబిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మావోయిస్టుల అగ్రనేతలు సమావేశమయ్యారని సమాచారం తెలియడంతో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఒకపక్క పోలీసులు కూంబింగ్‌ను ముమ్మరం చేయగా, మరోపక్క మావోయిస్టులు పోస్టర్లను గోడలకు, చెట్లకు అంటిస్తూ ఉనికిని చాటుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడి గిరిజనులు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఆంధ్రాలో ఎటువంటి అలజడులు లేనప్పటికీ సరిహద్దు ప్రాంతంలో పోలీసుల బూట్ల చప్పుడుతో గిరిజనులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఒకపక్క మావోలు, మరోపక్క పోలీసులు సమాచారం కోసం గిరిజనులపై వత్తిడి తెస్తున్నారు. ఇదిలా ఉండగా రెండు రోజుల కిందట ఒడిశాలోని నారాయణపట్నం లల్లేరి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనలో తమ్మ హారిక మృతి చెందిన విషయం విదితమే. ఈమె విజయనగరం జిల్లా, తెర్లాం మండలం మాజీ మావోయిస్టు యామిలాపల్లి సింహాచలం రెండో భార్యగా గుర్తించారు. అనంతరం పోలీసులు చేపట్టిన కూంబింగ్‌లో డంప్ స్వాధీనం చేసుకున్నారు.