ఆంధ్రప్రదేశ్‌

అక్రమ మైనింగ్‌కు టెక్నాలజీతో అడ్డుకట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 14: ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి అక్రమ మైనింగ్‌ను అడ్డుకుంటామని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావు చెప్పారు. సచివాలయం 3వ బ్లాక్‌లో తనకు కేటాయించిన కార్యాలయంలో శుక్రవారం ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పూజా కార్యక్రమం జరిగిన వెంటనే బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి రోజు కార్యాలయంలోకి అడుగుపెట్టడం, మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు. బాధ్యత కలిగిన ప్రతి వ్యక్తి అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలన్నారు. ఈ శాఖ ప్రభుత్వానికి ఏవిధంగా ఆదాయ వనరులు సమకూర్చడంలో ఉపయోగపడిందో భవిష్యత్‌లో కూడా అలాగే కృషి చేస్తానన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ లక్ష్యాలను ఏవిధంగా చేరుకోగలిగామో, 2017-18లో కూడా అదేవిధంగా చేరుకుంటామన్నారు. అక్రమ మైనింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పెట్టుబడిదారులను ప్రోత్సహించడానికి రెడ్‌కార్పెట్ వేసి స్వాగతం పలుకుతామన్నారు. తమ శాఖలో రెడ్ టేపిజం లేకుండా అన్నివిధాలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అనుసరించి పెట్టుబడులు రాబడతామన్నారు. ఖనిజ సంపదకు సంబంధించిన వివరాలను ప్రభుత్వపరంగా అందరికీ అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రస్తుతం తమ శాఖలో చాలావరకు ఆన్‌లైన్‌లోనే వ్యవహారాలను నిర్వహిస్తున్నామని, ఇప్పటికే గనుల లైసెన్సులకు అవసరమైన దరఖాస్తులన్నిటినీ ఆన్‌లైన్ ద్వారా స్వీకరించి అనుమతించే ప్రక్రియకు శ్రీకారం చుట్టామన్నారు. రాబోయే మూడునెలల్లో పూర్తిగా ఆన్‌లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సు (పార్టనర్ షిప్ సమ్మిట్)లో తమ శాఖకు సంబంధించి 10వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు (ఎంఓయులు) కుదర్చుకోగా, వాటిలో ఈ ఏడాది కనీసం 50శాతం పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తామని మంత్రి సుజయకృష్ణ రంగారావు వివరించారు.

చిత్రం.. తొలి ఫైల్‌పై సంతకం చేస్తున్న మంత్రి సుజయకృష్ణ రంగారావు