ఆంధ్రప్రదేశ్‌

త్వరలోనే ఐఎఎస్‌ల బదిలీలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 16: కొద్దిరోజులుగా అన్ని వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల బదిలీలు మరో రెండు, మూడురోజుల్లో కొలిక్కిరానున్నాయి. సోషల్ మీడియాలో మరికొద్ది గంటల్లో బదిలీలు అంటూ హడావుడి చేస్తున్నప్పటికీ కొంత సమయం వేచి ఉండక తప్పని పరిస్థితి. కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి, ఆయన స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్‌చంద్ర ఐఎఎస్‌ల బదిలీలపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. 2019 నాటి ఎన్నికలే లక్ష్యంగా ఉన్నతాధికారుల బదీలీల ప్రక్రియను సిఎం చేపడుతున్నారు. రెండు, మూడు జిల్లాలు మినహా బదిలీలపై దాదాపుగా కసరత్తు పూర్తయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక బదిలీల జాబితాను ప్రకటించనున్నారు. ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగాధిపతులకు కూడా బదిలీలు జరగనున్నాయి. 9 జిల్లాల కలెక్టర్లకు స్థానచలనం తప్పదని తెలుస్తోంది. పశ్చిమ గోదావరి, విజయనగరం, నెల్లూరు, విశాఖపట్నం కలెక్టర్లకు బదిలీలు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. చాలాకాలంగా ఉన్న శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లకు బదిలీ తప్పకపోవచ్చంటున్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ రేసులో ‘ఉడా’ వైస్ చైర్మన్ బాబురావు నాయుడు ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇవో, జెఇవోల బదిలీలు కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది. తితిదే ఇవో సాంబశివరావును ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా తీసుకొని తితిదే ఇవోగా సింఘాల్ నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. పనితీరు, విధేయత, తదితర అం శాల ప్రాతిపదికన బదిలీలు జరుగుతాయని భావిస్తున్నారు.