ఆంధ్రప్రదేశ్‌

హద్దు మీరితే వేటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 16: పార్టీ అంతర్గత వ్యవహారాలపై బహిరంగ వేదికపై చర్చించడం ద్వారా పార్టీని రచ్చకెక్కించే వైఖరి తప్పని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు, ఇంధన శాఖ మంత్రి కిమిడి కళా వెంకటరావు స్పష్టం చేశారు. విశాఖలో ఆదివా రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొద్ది రోజులుగా చిత్తూరు ఎంపి శివప్రసాద్ వ్యాఖ్యలపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆయ న పరోక్షంగా స్పందించారు. పార్టీ పరువును బజారుకీడ్చిన వ్యక్తులు ఎంతటి వారైనా సహించేది లేదని హెచ్చరించా రు. గతంలో కూడా కీలక నేతలను సైతం వదులుకున్న చరిత్ర టిడిపికి ఉందని గుర్తు చేశారు. ఈ విషయంలో అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన వైఖరితో ఉన్నారని, రాజకీయ పార్టీలకు సంస్థాగత నిర్మాణం కీలకమని, ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు టిడిపి ప్రతి రెండేళ్లకోసారి సంస్థాగత ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేస్తోందన్నారు. బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించడంతో పాటు కార్యకర్తల అభీష్టానికి పెద్దపీట వేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈఏడాది మహానాడు తెలంగాణ, ఎపిలో ఎక్కడ నిర్వహించాలన్న విషయంపై అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారన్నారు.
విశాఖలో విద్యుత్ మంత్రుల సమావేశం
ఈ నెల 27,28 తేదీల్లో జాతీయస్థాయి విద్యుత్ మంత్రుల సమావేశం విశాఖ వేదికగా నిర్వహించనున్నట్టు మంత్రి కళా వెల్లడించారు.
భవిష్యత్‌లో ఇంధన వనరుల అవసరం, ఉత్పత్తి తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3000 మెగావాట్ల సౌర విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని, ఈ నేపథ్యంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని క్రమంగా తగ్గించుకునే విషయమై ఆలోచిస్తున్నట్టు తెలిపారు. గతంతో పోలిస్తే సరఫరా నష్టాల ను 10 శాతానికి తగ్గించుకోవడం ద్వారా రూ.300 కోట్లు ఆదా చేయగలిగామన్నా రు. అలాగే అడవుల మీదుగా వెళ్లే విద్యు త్ లైన్ల నష్టాన్ని అంచనా వేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నామని తెలిపారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న ఎపి టిడిపి అధ్యక్షుడు, మంత్రి కళా వెంకటరావు