ఆంధ్రప్రదేశ్‌

రేణిగుంటలో హై అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, ఏప్రిల్ 16: తిరుపతి సమీపంలోని రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది హై అలర్ట్ ప్రకటించారు. ఆదివారం ఢిల్లీ ఇంటెలిజన్స్ హెచ్చరికల మేరకు దేశ వ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. బొంబాయి విమానాశ్రయంలో ఆరుగురు యువకులు విమానాలను హైజాక్ చేసేందుకు మాట్లాడుతుండగా ఓ ప్రయాణికురాలు విని ఈ విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఢిల్లీ విమానాశ్రయాధికారులకు ఇ-మెయిల్ ద్వారా పంపడంతో వారు ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ హెచ్చరికల మేరకు దేశంలోని ప్రధాన విమానాశ్రయాలతో పాటు పుణ్యక్షేత్రాల విమానాశ్రయాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.
శ్రీవారికి భూమి విరాళం
తిరుపతి, ఏప్రిల్ 16: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి రూ. 1.60 కోట్ల విలువ చేసే 2.60 ఎకరాల భూమిని కర్ణాటకకు చెందిన ఎల్.కార్తీక్ అనే భక్తుడు విరాళంగా ఇచ్చారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలోని శ్రీనివాసా తాలూక్ నీలవంక ఓబిలి వద్ద ఉన్న ఈ భూమి పత్రాలను ఆదివారం తిరుమల జెఇఓ కార్యాలయంలో జెఇఓ శ్రీనివాసరాజుకు అందజేశారు. ఈ సందర్భంగా జెఇఓ ఆయనను అభినందించారు.