ఆంధ్రప్రదేశ్‌

పట్టాలెక్కిన పర్యాటక రైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 16: అరకు పర్యాటక రైలు పట్టాలెక్కింది. ఆదివారం ఉదయం 10.30 గంటలకు భువనేశ్వర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర రైల్వేశాఖామంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఇదే సమయంలో అద్దాల ఏసి ప్రత్యేక రైలును విశాఖపట్నం రైల్వేస్టేషన్ ఎనిమిదో నెంబర్ ప్లాట్‌ఫారంపై నుంచి అరకు ఎంపీ కొత్తపల్లి గీత, ఎమ్మెల్సీలు పివి మాధవ్, గాదె శ్రీనివాసులనాయుడు, డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రలేఖముఖర్జీలు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అరకు ఎంపీ కొత్తపల్లి గీత మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. త్వరలోనే కేంద్రం అధికార ప్రకటన చేయనుందన్నారు. దేశంలో పలు ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల కోసం అద్దాల ఏసి ప్రత్యేక రైలును అందుబాటులోకి తీసుకువచ్చినందుకు కేంద్ర రైల్వేశాఖామంత్రికి, ఇది వచ్చేందుకు కృషి చేసిన విశాఖ ఎంపీ డాక్టర్ కంభంపాటి హరిబాబుకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్సీ పివి మాధవ్ మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ను ఏర్పాటు చేయడానికే కేంద్రం తొలి ప్రాధాన్యతనిస్తోందన్నారు. భారతదేశంలోనే అద్దాల ప్రత్యేక రైలు తొలిసారిగా నిర్వహిస్తుండటం ఇక్కడే సాధ్యపడిందన్నారు. జోన్ గురించి త్వరలోనే సానుకూల ప్రకటన రానుందని ఆయన పేర్కొన్నారు.
రూ.24 కోట్లతో మెకనైజ్డ్ లాండ్రీ
ఏసి కోచ్‌ల్లో ఉపయోగించే బెడ్‌సీట్లను ఎప్పటికపుడు శుభ్రపరిచేందుకు వీలుగా అత్యాధునిక పరిజ్ఞానంతో కూడుకున్న మెకానైజ్డ్ లాండ్రీని విశాఖ రైల్వేస్టేషన్ వద్ద ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి ఆదివారం శంకుస్థాపన జరిగింది. రూ.24 కోట్లతో నిర్మించనున్న ఇది వస్తే భారతీయరైల్వేలోనే తొలి మెకానైజ్డ్ లాండ్రీ కానుంది. ఆటోమెటెడ్ మెకానైజ్డ్ లాండ్రీని (బిల్ట్, ఓన్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్) పద్ధతిపై నిర్వహిస్తారు. 20,021 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.24 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకీ దాదాపు ఐదు మిలియన్ టన్నుల బట్టలు ఉతికేయొచ్చు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న ఈ ప్రాజెక్టు ద్వారా నాణ్యత కలిగి ఉండే విధంగా దుస్తులు శుభ్రపరుస్తుంది.