ఆంధ్రప్రదేశ్‌

కష్టాల్లో ఆర్టీసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 16: ఆర్టీసీ సంస్థ రూ.800 కోట్లకు పైగానే నష్టాలు ఎదుర్కొంటుందని రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రూ.2.5 కోట్ల విలువైన పది తెలుగు-వెలుగు ఆర్టీసీ బస్సులను ఆదివారం విశాఖ మద్దిలపాలెం కాంప్లెక్స్‌లో మంత్రి పచ్చా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడం, ఉద్యోగులకు రెగ్యులర్ చేయడం వంటి కారణాలతో కొంతవరకు సంస్థకు నష్టాలు వచ్చాయని పేర్కొన్నారు. అలాగే లీటర్ డీజిల్ రూ.12లకు పెరిగిందన్నారు. నష్టాలను సరిచేయడానికి లోపాలు సరిదిద్దాల్సి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాల్సి ఉందన్నారు. తాను ఈ బాధ్యతను తీసుకుంటామని హామీనిచ్చారు. సంస్థ యాజమాన్యం, కార్మిక సంఘాలు, కార్మికులు అంతా సహకరించాలని కోరారు. సంస్థ ఆదాయాన్ని పెంచడం కోసం ప్రయాణికుల వసతులు మెరుగుపర్చేందుకు ప్రజాప్రతినిధులు, ప్రయాణికులతో సమావేశాలు నిర్వహించడం, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటివి నిర్వహించాల్సి ఉందన్నారు. ప్రయాణికులు నిరీక్షించకుండా అందుబాటులో ఉండే వాహనంలో వెళ్ళిపోతున్నారని దీనిని దృష్టిలోపెట్టుకుని రవాణా సౌకర్యం మెరుగుపరచాల్సివుందని చెప్పారు. అలాగే ప్రమాదాలు అధికమవుతున్నాయని, రవాణాశాఖ తనవద్దనే ఉన్నందున ఇందుకు సంబంధించిన కార్యకలాపాలు మరింత వేగవంతం చేస్తూ ప్రమాదాల నివారణ కోసం కఠినంగా వ్యవహరించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఓవర్‌లోడ్ లేకుండా ప్రమాదాల వలన నష్టం ఏర్పడకుండా ప్రయాణికులకు మెరుగైన సేవలందించే క్రమంలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనుగోలు చేస్తామని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి సహకరించనుందని వెల్లడించారు. కార్మికుల బాధలు తనకు తెలుసనని, సమస్యల పరిష్కారం కోసం తాను కృషి చేస్తానన్నారు. అయితే సంస్థ బాగు కోసం కార్మికులు బాధ్యతగా పనిచేయాల్సి ఉందన్నారు. ఆర్టీసీ విజయనగరం జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.రామకృష్ణ పాల్గొన్నారు.