ఆంధ్రప్రదేశ్‌

పర్మినెంట్ చేయలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 18:రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసే అవకాశం లేదని మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది. అయితే కాంట్రాక్టు కార్మికుల జీతాలను 50 శాతం పెంచాలంటూ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వేతనం పెంపు వల్ల 26,664 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. వెలగపూడి సచివాలయంలో మంగళవారం మంత్రులు యనమల రామకృష్ణుడు, కాలువ శ్రీనివాసులు, గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాసరావుతో కూడి న మంత్రివర్గ ఉప సంఘం భేటీ అయింది. అనంతరం ఉప సంఘ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు కాలువ శ్రీనివాసులు, కామినేని శ్రీనివాసరావు విలేఖరులకు వివరించారు. ప్రస్తుతమున్న దానికంటే అదనంగా 50 శాతం మేర కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు పెంచాలని మంత్రి వర్గ ఉప సంఘం రాష్ట్ర క్యాబినెట్‌కు సిఫార్సు చేసిందన్నారు. జీతాల పెంపుదల నిర్ణయం ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. దీనివల్ల ప్రభుత్వంపై రూ.199.74 కోట్ల భారం పడుతోందని మంత్రులు తెలిపారు. పెరిగిన జీతాలను ఈ ఏడాది ఆర్థిక శాఖ మంజూరు చేస్తుందన్నారు. వచ్చే ఏడాది నుంచి ఆయా శాఖలే తమ బడ్జెట్‌లో కేటాయింపులు చేసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఏ శాఖ అయినా ఆర్థికశాఖ అనుమతితోనే ఉద్యోగులను నియమించుకోవాలని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెన్యువల్స్‌ను ఆయా శాఖలే చేసుకుని, వాటిని ఆర్థిక శాఖకు అందజేయాలన్నారు. సక్రమంగా పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం తొలగించే ప్రసక్తే లేదన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ, స్ర్తి, శిశు సంక్షేమ శాఖల్లో అత్యధికంగా కాంట్రాక్టు ఉద్యోగులున్నారన్నారు. వైద్య ఆరోగ్య శాఖలోనే 14,600లకు పైగా కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నట్లు వెల్లడించారు. ఎంపిహెచ్‌ఏలు 2,670 మంది, స్ట్ఫా నర్సులు 1,273, ఏఎన్‌ఎంలు (ఎన్‌ఆర్ హెచ్‌ఎంలు) 6,257, ఏఎన్‌ఎంలు 774 మంది, ఎడిషనల్ సబ్ సెంటర్లలో మరో 347 మంది ఉన్నారన్నారు. విద్యా రంగంలో 5వేలు, వ్యవసాయశాఖలో 6,350 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారన్నారు. భవిష్యత్తులో చేపట్టబోయే ఉద్యోగాల భర్తీకి, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల పెంపుదలకు ఎటువంటి సంబంధమూ లేదని మంత్రులు స్పష్టం చేశారు. కాగా కాంట్రాక్టు ఉద్యోగులను కోర్టు ఉత్తర్వులకు లోబడి రెగ్యులరైజ్ చేయాలని ఉద్యోగ సంఘాల జెఎసి నేత బొప్పరాజు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులు, ప్రభుత్వ వైద్యుల సమస్యలపై ప్రభుత్వం స్పందించడంపై కృతజ్ఞతలు తెలిపారు.

చిత్రం... మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలు తెలియచేస్తున్న మంత్రులు కామినేని, కాలువ