ఆంధ్రప్రదేశ్‌

కరవును పట్టించుకోని ప్రభుత్వాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 23: దేశంలో, రాష్ట్రంలో సాగునీరు, మంచినీరు, ఉపాధి లేక కోట్లాది మంది కరవుబారిన పడి కొట్టుమిట్టాడుతున్నారని, ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలసలు పోతున్నారని, కరవు సహాయక చర్యలు చేపట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. హనుమాన్‌పేటలోగల పార్టీ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్‌లో శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ దేశవ్యాపితంగా 256 జిల్లాలలో కరవు విలయతాండవం చేస్తోందని, సుమారు 35కోట్ల మంది ప్రజలు కరవుకోరల్లో చిక్కుకున్నారని తెలియజేశారు. అలాగే రాష్ట్రంలో పది జిల్లాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయని, 2.35 కోట్ల మంది కరవుబారినపడి ఒక్కపూట తిండికి కూడా నోచుకోక అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీగాని, చంద్రబాబు నాయుడు గానీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, సుప్రీంకోర్టు ముల్లుకర్రతో పొడిస్తే తప్ప వారిలో చలనం లేదని ఆగ్రహించారు. ‘‘దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిన’’ చందంగా ఇప్పుడు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసి సహాయ చర్యలు ఎందుకు చేపట్టలేదని వారిపై గంతులు వేస్తున్నారన్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వైఖరి కారణంగా లక్షలాది మంది వలసలు పోతున్నారని చెప్పారు.