ఆంధ్రప్రదేశ్‌

రాజకీయాలకు నిర్వచనం చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 20: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు 68వ జన్మదిన వేడుకలను రాష్ట్ర టిడిపి కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగు మహిళ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు, మంత్రి కళావెంకటరావు ప్రారంభించారు. రక్తదానంలో పాల్గొన్న దాతలకు కళా వెంకట్రావు పండ్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలేజీలో నాయకుడిగా తన జీవితాన్ని ప్రారంభించిన చంద్రబాబు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారన్నారు. రాష్ట్ర రాజకీయాలలో ఆరితేరిన వ్యక్తిగా, సంఘ సంస్కర్తగా ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని, ఎవ్వరూ చేయని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. దేశంలోని రాజకీయ నాయకులలోకెల్లా సీనియర్ నేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రోజుకు 16 గంటలపాటు అహర్నిశలు కష్టపడుతున్నది ఒక్క చంద్రబాబేనన్నారు. రాజకీయానికి, రాజకీయ పార్టీకి నిర్వచనం చెప్పిన వ్యక్తి చంద్రబాబేనని అన్నారు. నీరును పొదుపు చేసి దాని ఆవశ్యకతను ప్రతి ఒక్కరికి తెలియజేసేలా ప్రతి కార్యకర్త ఒక యజ్ఞంగా చేపట్టి నీరు- ప్రగతిని విజయవంతం చేయాలని, ఇదే మనం చంద్రబాబు నాయుడికి అందించే గొప్ప కానుక అన్నారు. మాజీ మంత్రి జెఆర్ పుష్పరాజు మాట్లాడుతూ టిడిపి పార్టీని ఎన్టీరామారావు ఒక ఉద్యమంగా మార్చగా, సంస్థాగతంగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని తెలిపారు. వెయ్యి రోజుల పాలనలో దేశంలోనే ఏ రాష్ట్రం పొందని విధంగా 47 అవార్డులు, రివార్డులు పొందారంటే అది సిఎం పరిపాలన గొప్పతనమని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టనటువంటి నదుల అనుసంధానం, విద్యుత్ పొదుపు, జాతీయ ఉపాధి హామీ వంటి కార్యక్రమాల్లో ప్రగతిని సాధించిన మొదటి రాష్ట్రంగా ఎపిని నిలబెట్టారని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు జీవీ ఆంజనేయులు, వివివి చౌదరి, టిడి జనార్దన్, జయరామిరెడ్డి, యాళ్ల సాయిబాబు, డొక్కా మాణిక్య వరప్రసాద్, సత్యనారాయణ రాజు, రాష్ట్ర ప్రోగ్రామ్ సెక్రటరీ సత్యవాణి, చందు సాంబశివరావు పాల్గొన్నారు.