ఆంధ్రప్రదేశ్‌

ఇక ప్రతివారం ఆరోగ్య కేంద్రాల తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 20: ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరును ఇకపై ప్రతివారం ఆకస్మికంగా తనిఖీ చేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ విభాగాధిపతులు, సర్వీస్ ప్రొవైడర్స్‌తో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని జిల్లాల్లో ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు. టెలికాన్ఫరెన్సు వ్యవస్థ కొన్ని చోట్ల సరిగా పని చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. దీనిపై విస్తృత ప్రచారం కల్పించాల్సి ఉందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు. పారిశుద్ధ్యం, యంత్రపరికరాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు. రోగ నిర్ధారణ పరికరాలను తక్కువ సమయంలో మరమ్మతు చేసి రోగులకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. కేంద్ర మంత్రి సురేష్ ప్రభు తన ఎంపిల్యాడ్స్ నిధుల నుంచి రాష్ట్రానికి ఇవ్వనున్న ఆంబులెన్సులకు సంబంధించి డిజైన్లను ఖరారు చేసి వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ, నాలెడ్జి పార్టనర్స్, సర్వీస్ ప్రొవైడర్స్ మధ్య మరింత సమన్వయం ఉండేలా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. చంద్రన్న సంచార చికిత్సా పథకం అమలులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. వైద్యులు సమయపాలన పాటించాలన్నారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, సంచాలకుడు జితేందర్ శర్మ, డిఎంఇ సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.