ఆంధ్రప్రదేశ్‌

మావోయిస్టులకు చెక్‌పెడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 21: ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలను పూర్తిగా నియంత్రిస్తామని డిజిపి ఎన్ సాంబశివరావు అన్నారు. విశాఖ నగరంలో పోలీసు అధికారులతో శుక్రవారం సమీక్షించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలు ఇప్పటికే నియంత్రణలో ఉన్నాయన్నారు. ఇప్పటికే ఏజెన్సీలో రాష్ట్ర పోలీసు బలగాలతో పాటు గ్రేహౌండ్స్, కేంద్ర పోలీసు దళాలు కూంబింగ్‌లో పలు కేంద్ర దళాలు పనిచేస్తున్నాయన్నారు. మరో రెండు కేంద్ర దళాలను రక్షణ నిమిత్తం రప్పిస్తున్నామన్నారు. మల్కన్‌గిరిలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా, పలువురు పోలీసు అధికారులు మావోయిస్టుల హిట్‌లిస్ట్‌లో చేరారన్నారు. వీరికి పటిష్ఠమైన భద్రత కల్పించడం తమ బాధ్యతగా పేర్కొన్నారు. దీనికోసం వ్యూహం సిద్ధంగా ఉందన్నారు. సోషల్ మీడియాలో చోటుచేసుకుంటున్న పలు అంశాలపై ఆయన స్పందించారు. సిఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లపై సోషల్‌మీడియా వేదికగా వస్తున్న పలు కథనాలపై విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. భావప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం కూడా నేరమేనన్నారు. తమ దృష్టికి వచ్చిన అంశాలపై తప్పకుండా విచారణ జరుపుతామని చెప్పారు. మీడియాలో వస్తున్న కథనాలపై కూడా తమకు ఫిర్యాదు అందితే స్పందిస్తామన్నారు.
అకాడెమీగా పోలీస్ శిక్షణ కళాశాల
విజయనగరం: రాష్ట్రంలో అత్యంత పురాతనమైన విజయనగరం పోలీస్ శిక్షణ కళాశాలను పోలీసు అకాడమీగా మార్పు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల డిజిపి సాంబశివరావు ఇక్కడకు వచ్చి పోలీస్ శిక్షణ కళాశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణకు అవసరమైన మార్పులు, చేర్పులను సూచిస్తూ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌ను కూడా పరిశీలించారు. దాదాపు 25 స్క్వాడ్‌లకు సరిపడే మైదానం కావడం, 400 మీటర్ల పరుగుపందానికి మూడు ట్రాక్‌లు ఉండటం, ఇతర వసతులు చూసి అకాడమీగా అభివృద్ధి చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది.