ఆంధ్రప్రదేశ్‌

కబళించిన ఇసుక మాఫియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి/రేణిగుంట, ఏప్రిల్ 21: ఇసుక మాఫియా ఆగడాలతో తమ బతుకులు తెల్లారి పోతున్నాయని ఆప్రాంతంలోని రైతులంతా చెప్పులరిగేలా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయంది...చివరికి అదే వారి ప్రాణాలు తీసింది. ఏర్పేడు ప్రమాదంలో మృతి చెందినవారంతా ఒకే గ్రామానికి చెందిన వారే.మునగలపాళ్యెంకు చెందిన ఎం.బత్తయ్య (45), ఎం.హరి (36), మునికృష్ణమ నాయుడు (53), గంగాధర నాయుడు (56), కె.నాగేశ్వరరావు(53), ఎ.ప్రభావతమ్మ (50), మునెయ్యనాయుడు (50), ఎ.కోదండపాణి (32),ఎం.సరస్వతమ్మ (60), బి.వసంత (30), కె.జయచంద్ర (30), ఎన్.్భస్కరయ్య (64), ఎస్.సుమతి (40), పి.సుధాకర్ నాయుడు (49),ఎం.రాజేంద్ర (42) మృతుల్లో ఉన్నారు. మృతుల్లో కమ్మ, రెడ్డి, యాదవ, ముత్రాసి, ఎస్సీ కులానికి చెందిన వారు ఉన్నారు. గాయపడిన 22మందిలో తిరుపతి రూరల్ ఓటేరుకు చెందిన జి.సోమశేఖర్ (34), మునలగలపాల్యెంకు చెందిన పి.్భనుప్రసాద్ (42), కస్తూరి గీత (39), డి.సావిత్రమ్మ (55), ఎనమపల్లి బాబు (18), బోండాల దినేష్ (15), చిన్నప్ప నాయుడు, సుబ్రహ్మణ్యం నాయుడు (52), సుబ్బమ్మ (38), ఎస్.దామోదరం (42), రామచంద్రనాయుడు (72), విజయేంద్రనాయుడు (50), కోటమ్మ (52), ముసిలిపేడుకు చెందిన మాతం సాయికుమార్ (12), ఇసుకతాగేలికి చెందిన అరుసు బాలమురళీ కృష్ణారెడ్డి, ఏర్పేడుకు చెందిన గండ్ల మునెమ్మ (45), చిన్నప్పనాయుడు ఉన్నారు. వీరికి రుయా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా రేణిగుంట రోడ్డులోని నారాయణాద్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో ములగల పాళ్యెంకు చెందిన ఏ.మునికృష్ణయ్య (60), ఆర్‌మునిరత్నం (60), బాలకృష్ణాపురానికి చెందిన బి.హరిబాబు (48)లు ఉన్నారు. రేణిగుంట రూరల్ సి ఐ సాయినాథ్, ఏర్పేడు ఎస్ ఐ రామకృష్ణ, కానిస్టేబుల్ కె.జయచంద్ర (54), ముగ్గురు విలేఖరులు కూడా గాయపడిన వారిలో ఉన్నారు. విలేఖరుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ప్రమాదవార్త తెలుసుకున్న ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు, శాప్ చైర్మన్ పి ఆర్ మోహన్ సంఘటనా సహాయ చర్యలకు సమాయత్తం చేశారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ జయలక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. వైకాపా శ్రీకాళహస్తి నియోజక వర్గ ఇన్‌చార్జ్ మధుసూదన్ రెడ్డి, ఇతర ప్రజా సంఘాల నేతలు సహాయ చర్యల్లో భాగస్వాములయ్యారు. మృతులకు రూ.20 లక్షలు, క్షతగాత్రులకు రూ. 10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. అధికారం దన్నుతో ఇసుక మాఫియాకు పాల్పడ్డ టిడిపి నాయకులపై పిడి యాక్ట్‌ను బనాయించాలని డిమాండ్ చేశారు.
త్రుటిలో తప్పించుకున్న ఎస్పీ జయలక్ష్మి
ఏర్పేడు వద్ద దుర్ఘటన జరగడానికి కొద్ది క్షణాల ముందే తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ జయలక్ష్మి అక్కడ నుంచి వెళ్ళడంతో ఆమె ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి ఏర్పేడు పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఉదయం తనిఖీ చేయడానికి వెళ్ళారు. ఆమె దాదాపు గంటకుపైగా స్టేషన్లోనే ఉండి ఫైళ్ళను తనిఖీ చేసి సి ఐ సాయినాథ్‌కు, ఎస్ ఐ రామకృష్ణకు కొని సూచనలు చేశారు. ఆ సమయంలోనే అక్కడకు చేరుకున్న మునగలపాళ్యెం వాసులు ఇసుక మాఫియాపై ఆమెకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించారు. ఫైళ్ళను తనిఖీ చేసిన తరువాత స్టేషన్ బయటకు వచ్చిన ఎస్పీతో స్థానికులు కొద్దిసేపు తమ సమస్యను చెప్పుకున్నారు. అయితే ఇది రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయాలని, ఏదేమైనా సి ఐ, ఎస్ ఐలతో మాట్లాడండని చెప్పి అక్కడ నుంచి ఆమె తిరుపతికి బయలుదేరి వచ్చేశారు. ఆమె అటు వెళ్ళగానే సి ఐ, ఎస్ ఐలు గ్రామస్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ స్టేషన్‌లోకి వస్తే మాట్లాడకుందాం రండి అనగానే, ఎస్పీ తీరును నిరసిస్తూ స్థానికులు అక్కడే బైఠాయించారు. ఇదంతా కొద్ది క్షణాల్లోనే జరిగింది. అయితే వారు ఊహించని విధంగా 10చక్రాల భారీ లారీ వేగంగా వచ్చి వారిపై నుంచి దూసుకుపోయింది. సి ఐ, ఎస్ ఐతోపాటు మరో 22 మంది గాయపడ్డారు.
తీవ్రంగా గాయపడ్డ జర్నలిస్టులు
ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా ఏర్పేడు పోలీస్ వద్ద మునగలపాళ్యెం గ్రామస్థులు చేస్తున్న ఆందోళనను కవర్ చేయడానికి వెళ్ళిన వివిధ దినపత్రికలకు చెందిన ముగ్గురు జర్నలిస్టులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. లారీ దూసుకువచ్చే సమయంలో అక్కడే ఉన్న ఆంధ్రజ్యోతి దినపత్రిక విలేఖరి బాలమురళికి రెండు కాళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆంధ్రప్రభ విలేఖరి హరిబాబు, విశాలాంధ్ర విలేఖరి వెంకటేష్‌లకు తీవ్రగాయాలైయ్యాయి