ఆంధ్రప్రదేశ్‌

ఏర్పేడు దుర్ఘటనలో బాధితులకు పరిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 22: చిత్తూరు జిల్లా ఏర్పేడులో శుక్రవారం జరిగిన సంఘటన అత్యంత దురదృష్టకరమైందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటి శాఖ మంత్రి నారాలోకేష్ అన్నారు. శనివారం ఆయన రాష్ట్ర మంత్రులు అమర్‌నాథ్ రెడ్డి, నారాయణ, మాణిక్యాలరావుతో కలసి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి ఓదార్చారు. కాగా బాధితులంతా ముక్తకంఠంతో ఇసుక మాఫియా లీడర్ ధనంజయనాయుడుపై లోకేష్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం వారంతా కలిసి మునగలపాళ్యెం,రావెళ్లవారి కండ్రిక, ముసలిపేడ గ్రామాల్లో పర్యటించి మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషియా పది లక్షల రూపాయల చెక్కును అందించారు. టిడిపి కార్యకర్తలైతే కార్యకర్తల సంక్షేమ నిధి కింద మరో రెండు లక్షలు అందజేస్తామని మంత్రి లోకేష్ చెప్పారు.
అనంతరం మంత్రి లోకేష్ తిరుపతిలోవిలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఇసుక మాఫియాను ఉపేక్షించబోమన్నారు. ఏర్పేడులో ఇసుక మాఫియాపై విచారణ జరిపించి పార్టీలకు అతీతంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు.