ఆంధ్రప్రదేశ్‌

అడుగడుగునా ఉల్లంఘనలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 22: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిందని, కాంగ్రెస్ నాయకుడు, సామాజిక వేత్త బొలిశెట్టి సత్యనారాయణ (సత్య) ఆరోపించారు. విశాఖలో శనివారం విలేఖరులతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణంలో ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి)ని తప్పుదోవ పట్టించిందన్నారు. అమరావతిలో రాజధాని నిర్మించాలన్న ప్రభుత్వ ఆలోచనలపై తనతో పాటు పి శ్రీమన్నారాయణ, ఇఎఎస్ శర్మ వేర్వేరుగా ఎన్‌జిటిని ఆశ్రయించామన్నారు. రాజధాని నిర్మాణానికి ఎంపిక చేసిన ప్రాంతంలో వాగుల దారి మళ్లించడంతో పాటు కృష్ణానది ఇసుక తినె్నల్లో నిర్మాణాలను చేపట్టారన్నారు. లంక భూముల్లో నిర్మాణాలకు అనుమతులు పర్యావరణ పరంగా సాధ్యం కాదని, కేంద్ర సంస్థలు అనుమతులు ఇవ్వనప్పటికీ ప్రభుత్వం నిర్మాణాలు పూర్తి చేసిందని ఆరోపించారు. ఈ విషయంలో ఎన్‌జిటికి ప్రభుత్వం తప్పుడు నివేదికలు సమర్పించిందన్నారు. ఇసుక మేటల్లో నిర్మాణాలపై ప్రభుత్వం చూపిన కారణాలు ఎన్‌జిటిని సంతృప్తి పరచలేకపోయాయన్నారు. వరద ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో రాజధాని నిర్మాణం విషయంలో తాము మొదటి నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నామన్నారు. అమరావతి నిర్మాణం వల్ల కృష్ణా నదీ తీర ప్రాంతంలో పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటుందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం రాజధాని నిర్మాణం కోసం పునర్విభజన చట్టం మేరకు కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. కమిటీలో నిపుణులు లేరన్నారు. నిర్మాణాలకు కనీస అనుమతులు కూడా ప్రభుత్వం తీసుకోలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాల్పడిన ఉల్లంఘనలకు సంబంధించి పూర్తి వివరాలను అన్ని సాక్ష్యాధారాలతో ఎన్‌జిటికి నివేదించామన్నారు. తమ వాదనలతో ఎన్‌జిటి పూర్తి సంతృప్తి చెందిందని వెల్లడించారు. 10వేల ఎకరాలల్లో పచ్చటి పొలాలను, కృష్ణా ఇసుక మేటలను, కొండ వాగులను చిన్నాభిన్నం చేస్తూ నిర్మాణాలు చేపట్టిన ప్రభుత్వ తీరుపై తాము సాక్ష్యాలను అందజేశామన్నారు. రాజధాని నిర్మాణంపై ఇప్పటి వరకూ న్యాయపరంగా తాము పోరాడామని, దీన్ని ప్రజా ఉద్యమంగా మారుస్తామని స్పష్టం చేశారు. అమరావతి రాజధాని నిర్మాణం అంశంలో సామాజిక వేత్త అన్నా హజారే సహకారం తీసుకుంటున్నట్టు వెల్లడించారు. హజారే తమకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని, వచ్చే జూన్‌లో ఆయన అమరావతి రాజధాని నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించనున్నారని సత్య తెలిపారు.