ఆంధ్రప్రదేశ్‌

హంద్రీనీవా కాలువ వెడల్పునకు గ్రీన్‌సిగ్నల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఏప్రిల్ 22 : రాయలసీమ రైతుల పాలిట వరప్రదాయిని అయిన హంద్రీనీవా సుజల స్రవంతి(హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) ప్రధాన కాలువ ఫేజ్-1ను వెడల్పు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు పరిపాలనా పరమైన అనుమతులు ఇవ్వడంతో సీమ రైతుల్లో ఆశలు చిగురించాయి. ముఖ్యంగా నిత్య కరవు కాటకాలతో కునారిల్లుతున్న అనంతపురం జిల్లాకు హంద్రీనీవా కాలువ వెడల్పు ద్వారా సాగు, తాగునీరు లభించి అత్యంత ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. హంద్రీనీవా ఫేజ్-1లో ముచ్చుమర్రి నుంచి అనంతపురం జిల్లాలోని జీడిపల్లి రిజర్వాయర్ వరకూ కాలువ వెడల్పు పనులకు అనుమతి ఇస్తూ, అందుకు సంబంధించిన జీఓను గురువారం సిఎం చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా పామిడి సభలో వేదికపై నుంచే విడుదల చేసిన విషయం విదితమే. మొత్తం 3,850 క్యూసెక్కుల నీటిని తరలించేందుకు వీలుగా కాలువ వెడల్పు చేయనున్నారు. ప్రస్తుతం 2,050 క్యూసెక్కుల నీరు తరలించే సామర్థ్యం ఉంది. అధికారిక సమాచారం మేరకు కాలువ వెంబడి కుడివైపు నుంచి 3 మీటర్లు మొదలు 7 మీటర్ల మేర వెడల్పు చేయనున్నారు. ముచ్చుమర్రి వద్ద ఉన్న పంపింగ్ స్టేషన్ నుంచి జీడిపల్లి రిజర్వాయర్ వరకూ ఈ పనులు చేపట్టేందుకు మొత్తం రూ. 1272.41 కోట్లతో చీఫ్ ఇంజినీర్ గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ నేపథ్యంలో రూ. 1,030 కోట్ల అంచనా వ్యయంతో కాలువ వెడల్పు పనులు చేపట్టడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాగా ఆయా పనులను 3 నెలల్లో పూర్తి చేయాలని సిఎం అధికారులను ఆదేశించడంతో పనులు వేగవంతం కానున్నాయి. శ్రీశైలం జలాశయం నుంచి 40 టిఎంసిల మిగులు జలాలను వినియోగించుకుంటూ అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల జనాభాకు తాగునీరు కల్పించేందుకు హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టును రూపకల్పన చేశారు. మొదటి దశలో అనంతపురం జిల్లాలో 1,18,800 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4 లక్షల జనాభాకు తాగునీరు అందించేలా ప్రతిపాదనలున్నాయి. రెండో దశలో 2,27,000 ఎకరాలకు సాగునీరు, 16 లక్షల మంది జనాభాకు తాగునీరు అందించాలన్నది లక్ష్యం. ఈ నేపథ్యంలో మొదటి, రెండో దశ సివిల్, మెకానికల్ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గత ఏడాది(2015-16)లో లిఫ్ట్‌ల ద్వారా 7.76 టిఎంసిల నీటిని కర్నూలు జిల్లా క్రిష్ణగిరి జలాశయానికి, పత్తికొండ జలాశయానికి, అనంతపురం జిల్లాలోని జీడిపల్లి జలాశయానికి తరలించి వాటిని నింపినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎట్టకేలకు సిఎం చంద్రబాబు హంద్రీనీవా కాలవ ఫేజ్-1లో వెడల్పు చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో జిల్లాకు కేటాయించిన నీటిని తెప్పించుకునే అవకాశం కలుగుతుందనే చెప్పొచ్చు.
టెండరు ప్రతిపాదనలు
హంద్రీనీవా కాలువ వెడల్పునకు సంబంధించి టెండరు ప్రతిపాదనలను సంబంధిత అధికారులు సిద్ధం చేశారు. వీటిని శుక్రవారం రాత్రి ప్రభుత్వానికి పంపారు. శుక్రవారం అనంతపురంలోని హంద్రీనీవా చీఫ్ ఇంజినీర్ కార్యాలయంలో సిఇ జలంధర్, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టెండర్ల ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం 90 రోజుల వ్యవధిని నిర్ధేశించినందున కాలువ వెడల్పు పనులు వేగవంతం కానున్నాయి.