ఆంధ్రప్రదేశ్‌

సిబిఐ విచారణ జరిపించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 23: ఏర్పేడు సంఘటనపై సిబిఐ చేత విచారణ జరిపించాలని వైకాపా అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని మునగలపాలెంలో ఏ వ్యక్తిని, ఏ బాధితుడిని కదిపినా ధనంజయులు నాయుడు, ఆయన అనుచరులు ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారని, 15 మంది చనిపోవడానికి వారే కారణమని ఘోషిస్తున్నా వారిపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తున్నారని, ఇందుకు సిఎం చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. ఏర్పేడు సంఘటనలో బాధిత కుటుంబాల వారిని పరామర్శించడానికి జగన్ ఆదివారం ఆ గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మృతి చెందిన వారి ప్రతి కుటుంబాన్ని కలసి ఓదార్చారు. ఈ క్రమంలో మునగలపాలెంలో జరుగుతున్న దారుణాలను అక్కడి ప్రజలు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం తాము అధికారంలో లేమని, అయినప్పటికీ ప్రజల పక్షాన తాను పోరాటం ఆపడం లేదన్నారు. మీ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
ఈ సందర్భంగా అక్కడ విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భూగర్భ జలాలను పరిరక్షించడమే కాకుండా తమ పంట పొలాలకు నీళ్లు లేకుండా పోతున్నాయని గ్రామస్థులు ఇసుక మాఫియాపై ఒక ఉద్యమాన్ని నడిపారన్నారు. అధికార పార్టీకి చెందిన నేతలే ఇసుక మాఫియాకు పాల్పడుతున్న క్రమంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రజల ఆక్రందనలను నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాలుగా యథేచ్ఛగా ఇసుక మాఫియా ఆగడాలు కొనసాగుతున్నాయని ప్రతిఒక్కరూ తనకు చెప్పారన్నారు. అనేక సార్లు తహసీల్దార్, పోలీసుల వద్దకు వెళ్లి చర్యలు తీసుకోవాలని కోరినా పట్టించుకోలేదని, దీంతో వారు మరింత బరితెగించారని, తమపై దాడులకు తెగబడుతున్నారని కంటతడి పెట్టుకున్నట్లు జగన్ చెప్పారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎనిమిదిచోట్ల ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్నారు. పోలీసులు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలను స్టేషన్‌లోకి రానిచ్చి ఉంటే ఇంత ప్రాణనష్టం జరిగి ఉండేది కాదన్నారు. ఒక పథకం ప్రకారమే తమను స్టేషన్ బయటపెట్టి హత్య చేయించారని ప్రజలు ఆరోపిస్తున్నారని, దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. ఇక రూ. 10 లక్షలు నష్టపరిహారం ఇచ్చామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందన్నారు. నిజంగా వీరికి మానవత్వం ఉంటే ప్రజలు ఆరోపిస్తున్న టిడిపి నేతలపై కేసులు తక్షణం బనాయించాలన్నారు. అంతేకాకుండా గత రెండు, మూడేళ్లుగా సంపాదించిన రూ.200 కోట్లను స్వాధీనం చేసుకుని, ఒక్కో మృతుని ఇంటికి రూ. 50 లక్షలు ఇచ్చినా బాధిత కుటుంబాలకు న్యాయం చేసినవారు కాదని జగన్ అన్నారు. మీడియాను ఒక్కటే కోరుతున్నానని, మీరైనా ఇక్కడ జరుగుతున్న దారుణాలను ప్రపంచానికి తెలియజేయాలన్నారు.
ఇది ప్రమాదమని మీరు నిర్థారిస్తున్నారా అన్న ప్రశ్నకు తన దృష్టికి వచ్చిన పరిణామాలను పరిశీలిస్తే ప్రమాదంపై కూడా అనుమానాలు ఉన్నాయని, అందుకే తాను సిబిఐ చేత విచారణ జరిపించాలని కోరుతున్నానన్నారు. ఇక్కడి ప్రజలు కూడా ఇలాంటి అనుమానాలనే వ్యక్తం చేస్తున్నారన్నారు. జగన్ వెంట ఎంపిలు మిధున్‌రెడ్డి, వరప్రసాద్, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, శ్రీకాళహస్తి వైకాపా నాయకుడు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, గోపియాదవ్ తదితరులు ఉన్నారు.

చిత్రం... మునగలపాలెంలోని మృతుల కుటుంబాలను పరామర్శిస్తున్న జగన్