ఆంధ్రప్రదేశ్‌

మరుగుదొడ్డి ఉంటేనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 25: ఇంట్లో మరుగు దొడ్డి కట్టించనివారిని స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించే చట్టాన్ని తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మరుగు దొడ్డి కట్టించుకోవడాన్ని తప్పనిసరి చేసే ఉద్దేశంతోనే ఈ చట్టాన్ని తీసుకురానున్నట్టు ఆయన తెలిపారు. ఇకపై ఇసుక అక్రమ రవాణా, ప్రమాదాలకు సంబంధించి ఇకపై ఆయా జిల్లాల ఎస్పీ, కలెక్టర్లదే బాధ్యతని స్పష్టం చేశారు. ఇసుక అక్రమ రవాణా చేసేవారు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా ప్రయోజనం కోసం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన ఉచిత ఇసుక విధానం కొన్ని చోట్ల పక్కదారి పట్టడం సహించరానిదన్నారు. చిత్తూరు జిల్లా ఏర్పేడులో జరిగింది ప్రమాదమే అయినప్పటికీ వారందరూ అక్కడ ఉండడానికి ప్రధాన కారణం ఇసుక అక్రమ రవాణాపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేయడానికేనని తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రాథమికంగా రవాణా శాఖ వైఫల్యం కన్పిస్తోందన్నారు. మహబూబ్ నగర్ నుంచి బయలుదేరిన లారీ రెండు మూడు చెక్‌పోస్టులు దాటిన తర్వాతే అక్కడకు వచ్చే అవకాశముందని, కాని ఎక్కడా అధికారులు సక్రమంగా చేయలేదని, చేసి వుంటే ప్రమాదం తప్పేదని అభిప్రాయపడ్డారు. భారీ వాహనం నడిపే లైసెన్సు సంబంధిత డ్రైవర్‌కు లేకపోవడమే కాకుండా తాగి ఉండటం, డ్రైవింగ్‌ను క్లీనర్‌కు అప్పగించడం లాంటి పొరపాట్లు ఈ ఘటనలో ఉన్నాయన్నారు. మైనింగ్, రెవెన్యూ, హోం మంత్రులకు ఈ బాధ్యత అప్పగిస్తున్నామని వారు డిజిపి, సిసిఎల్‌ఎ, రెవెన్యూ కార్యదర్శులతో కలిసి ఇసుక సరఫరాపై నిరంతర పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో తన కార్యాలయంలో వివిధ శాఖాధిపతులతో మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. నీతి అయోగ్ నిర్దేశించిన లక్ష్యాలు మన రాష్ట్రం నిర్ణయించుకున్న లక్ష్యాలకు దగ్గరగా ఉన్నాయని, రెండున్నరేళ్ల క్రితమే తగిన కృషిని ఆరంభించిన రాష్ట్రంగా వేగంగా మనం ఫలితాలను సాధించి దేశానికే ఆదర్శవంతంగా నిలవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయాన్ని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యక్రమాలకు వేదికగా మార్చనున్నట్లు తెలిపారు. పరిపాలనలో ఉన్నత ఫలితాలను సాధించేందుకు అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని సిసిఎల్‌ఎ పునేటా సూచించారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇన్‌ఛార్జిగా ఎస్‌పి టక్కర్‌ని నియమిస్తున్నట్లు తెలిపారు. ఎపి ఫైబర్ గ్రిడ్ దేశానికే ఆదర్శంగా నిలవడంపై నీతి ఆయోగ్‌లో అభినందించారని తెలిపారు. డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లమని ప్రధానమంత్రి కోరారని తెలిపారు. వ్యవసాయంలో రానున్న ఐదేళ్లలో రెట్టింపు ఆదాయాన్ని పొందడానికి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మే 1 నుంచి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యకలాపాలు ప్రారంభం కావాలని, అధికారులలో నైపుణ్యం పెంపు బాధ్యతలు విశ్రాంత సిఎస్ టక్కర్‌కు అప్పగిస్తున్నట్లు తెలిపారు.
ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఐఎఎస్ అధికారి కాంతిలాల్ దండే పేరును ప్రస్తావించకుండా ముఖ్యమంత్రి ఈ సమావేశంలో వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రజలచేత ఎన్నికైన తాము విధానాలను రూపకల్పన చేస్తామని, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ విధానాలను విమర్శించే తీరులో అధికారులు వ్యవహరించడం సరికాదని స్పష్టం చేశారు.

చిత్రం... శాఖాధిపతుల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు