ఆంధ్రప్రదేశ్‌

అక్రమ నిర్మాణాలు అనుమతించవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 27: అమరావతి రాజధాని ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను అనుమతించరాదని, అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సిఆర్‌డిఏ) అధికారులను ఆదేశించింది. జస్టిస్ చల్లా కోదండరామ్‌కు ఈ కేసును విచారించారు. కృష్టా జిల్లా పెనమలూరుకు చెదిన అనేక మంది ఈ కేసుపై పిటిషన్లను దాఖలు చేశారు. తాము నిర్మించుకున్న ఇండ్లు అక్రమ కట్టడాలంటూ అధికారులు కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నారని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల వల్ల నగరం తన అందాన్ని కోల్పోయిందన్నారు. ఈ పరిస్ధితి రాకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. ఆంధ్ర ప్రజల ఆకాంక్షల మేరకు కొత్త రాజధాని నిర్మాణం జరగాలన్నారు. హైకోర్టు ఆదేశం మేరకు సిఆర్‌డిఏ డైరెక్టర్ కోర్టుకు హాజరయ్యారు. విదేశాల్లో ఉన్నందుకు హాజరు కాలేకపోతున్నామని సిఆర్‌డిఏ సిఇవో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్లు పేర్కొన్న అంశాలపై కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైకోర్టు సిఆర్‌డిఏ అధికారులను ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణను జూన్ 7వ తేదీకి వాయిదా వేశారు.