ఆంధ్రప్రదేశ్‌

నేడు అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 27: ఎపి ఎంసెట్-2017 అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్షలను తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం నిర్వహించడానికి జెఎన్‌టియుకె పటిష్ట ఏర్పాట్లుచేసింది. ఇంజనీరింగ్ పరీక్షలు ఈనెల 26వ తేదీతో పూర్తయిన విషయం విదితమే. మూడు రోజుల పాటు ఇంజనీరింగ్ పరీక్షలను నిర్వహించగా, అగ్రికల్చర్, మెడిసిన్ ప్రవేశ పరీక్షలను ఒక్కరోజులో నిర్వహించేలా ఏర్పాట్లుచేశారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ జెఎన్‌టియులో శుక్రవారం ఉదయం పరీక్షలకు సంబంధించిన పాస్‌వర్డ్ విడుదలచేస్తారు. అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్షలకు 80వేల 735 మంది అభ్యర్ధులు హాజరు కావల్సి ఉంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 40వేల మంది, సాయంత్రం 40వేల మంది వంతున పరీక్షలు రాసేవిధంగా ఎంపికచేసిన ఆన్‌లైన్ కేంద్రాల్లో కంప్యూటర్లు సిద్ధంచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 43 రీజనల్ సెంటర్లు, హైదరాబాద్‌లో 3 రీజనల్ సెంటర్ల పరిధిలో 139 పరీక్షా కేంద్రాలను అగ్రికల్చర్, మెడిసిన్ ప్రవేశ పరీక్షలకు ఏర్పాటుచేశారు. పరీక్షల పర్యవేక్షణకు 139 మంది పరిశీలకులను, రెవెన్యూ విభాగం నుండి ప్రత్యేక పరిశీలకులను నియమించారు. కాగా ఎంసెట్-2017 ఇంజనీరింగ్ ప్రిలిమినరీ కీని శుక్రవారం సాయంత్రం విడుదల చేస్తారు. విద్యార్థులకు ఏ విధమైన అభ్యంతరాలున్నా వెనువెంటనే ఆన్‌లైన్‌లో విజ్ఞాపనలను స్వీకరిస్తారు. మే 1వ తేదీ సాయంత్రం వరకు విద్యార్థుల నుండి అభ్యంతరాలను స్వీకరిస్తామని ఎంసెట్-2017 కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు తెలిపారు. మే 1వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా విశ్వవిద్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్ధులకు సూచించారు. అగ్రికల్చర్, మెడిసిన్ ప్రవేశ పరీక్షకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన సమయం కంటే ముందుగా కేంద్రాలకు హాజరు కావాలని సాయిబాబు అభ్యర్థులకు సూచించారు.