ఆంధ్రప్రదేశ్‌

తెలుగు రాష్ట్రాల్లో తొలి ఒడిఎఫ్ జిల్లాగా ప.గో.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 28: వివిధ అంశాల్లో ముందంజలో ఉంటూనే రాజకీయ చైతన్యంలోనూ పేరొందిన పశ్చిమ గోదావరి జిల్లాకు తాజాగా రెండు ఘనతలు జతకూడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే తొలి బహిరంగ మల విసర్జన రహిత (ఒడిఎఫ్) జిల్లాగా పశ్చిమగోదావరి జిల్లాను ప్రకటించనున్నారు. మరోవిధంగా చూస్తే దాదాపుగా దక్షిణాదిరాష్ట్రాల్లోనే ఈవిధంగా పూర్తి ఒడిఎఫ్‌గా ప్రకటించిన జిల్లాలు లేవన్న అంచనా కూడా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పశ్చిమ తొలి ఒడిఎఫ్ జిల్లాగా రికార్డులకు ఎక్కనుంది. ఇలాంటి కీలకమైన ప్రకటనను స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం జిల్లాలోని నల్లజర్లలో జరిగే భారీ బహిరంగసభలో ప్రకటించనున్నారు. గత కొంతకాలంగా ఒడిఎఫ్ సాధన కోసం మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం విశేషంగా కృషి చేయటం ద్వారానే ఈ ఘనత సాధ్యమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బహిరంగ మలవిసర్జన రహిత (ఒడిఎఫ్)గా జిల్లాను ప్రకటించడానికి సమాయత్తం చేయటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యారు. జిల్లావ్యాప్తంగా ప్రతి గ్రామంలో, మండలంలోనూ మరుగుదొడ్డి నిర్మాణాలు పూర్తిచేశారు. కొన్ని వెనుకబడిన ప్రదేశాల్లో స్ధానికుల సహకారంతో ఈ లక్ష్యాన్ని సాధించగలిగారు. మరోవైపు ఒడిఎఫ్ ప్రకటనతో పాటు పశ్చిమను పొగరహిత జిల్లాగా తీర్చిదిద్దిన ఘనత కూడా ఈసారే అందిరానుంది. జిల్లావ్యాప్తంగా ప్రతి కుటుంబానికి గ్యాస్ కనెక్షన్లు అందించటం ద్వారా పొగపొయ్యిలు వినియోగించే పరిస్థితి లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈవిధంగా పొగరహిత జిల్లాగా కూడా పశ్చిమను తీర్చిదిద్దిన నేపథ్యంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రకటన కూడా శనివారంనాటి పర్యటనలో చేయనున్నారు.