ఆంధ్రప్రదేశ్‌

పెట్టుబడులకు ఆంధ్రా అనుకూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 10: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకూలంగా ఉందని చైనాలోని షెన్యాంగ్ మున్సిపల్ పీపుల్స్ కాంగ్రెస్ చైర్మన్ పాన్ లింగో అన్నారు. ఆయన నేతృత్వంలోని చైనా ప్రభుత్వ సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తల బృందం బుధవారం ఉదయం వెలగపూడిలోని సచివాలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా సచివాలయం 2వ బ్లాక్‌లో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం, వాణిజ్యం, ప్రభుత్వ రంగ సంస్థల శాఖల మంత్రి అమరనాథరెడ్డి, పరిశ్రమల, పట్టణాభివృద్ధి శాఖ, ఏపి ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఏడీబీ) సీనియర్ అధికారులు వారికి స్వాగతం పలికారు. అనంతరం చైనా, ఏపి బృందాల మధ్య జరిగిన సమావేశంలో ఏపి అధికారులు రాష్ట్భ్రావృద్ధి, పెట్టుబడులకు అవకాశాల గురించి వీడియో ప్రదర్శన ద్వారా వివరించారు. దేశంలో ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపి నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలో రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు ప్రపంచ బ్యాంక్ పేర్కొన్నట్లు తెలిపారు. చైనా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన షెన్యాంగ్ మున్సిపల్ పీపుల్స్ కాంగ్రెస్ చైర్మన్ పాన్ లింగో మాట్లాడుతూ షెన్యాంగ్ సిటీ అభివృద్ధి క్రమం వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాతావరణం తమకు నచ్చినట్లు తెలిపారు. చైనా బృందం పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో కూడా సమావేశమైంది. ఈ సందర్భంగా పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కరికాల వరవన్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో వౌలిక వసతులు, పెట్టుబడులకు అవకాశాలు వివరించారు.
చైనాకు చెందిన వెల్ హోప్, భారత్‌కు చెందిన నెక్సెస్ ఫీడ్స్ సంస్థలు ఉమ్మడిగా భారత్‌లో ఇప్పటికే పౌల్ట్రీ ఫీడ్స్ ఉత్పత్తిని ప్రారంభించాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఏపిలలో ఉత్పత్తి ప్రారంభించినట్లు నెక్సెస్ ఫీడ్ ఎండి సత్యనారాయణరెడ్డి చెప్పారు. రెండు విడతలుగా జరిగిన సమావేశాల్లో మంత్రి అమరనాథ్‌రెడ్డి, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వరవన్, షెన్యాంగ్ సిటీ చైర్మన్ పాన్ లింగ్, చైనా వ్యాపారవేత్త వెల్ హోప్ ఎండీ ఎలెక్స్, నెక్సెస్ ఫీడ్ ఎండి సత్యనారాయణరెడ్డి, చైనా, ఏపి ప్రభుత్వం ఉన్నతాధికారులు, ఏపి ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..చైనా ప్రతినిధి బృందంతో మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి సమావేశం