ఆంధ్రప్రదేశ్‌

నారదుడు పాత్రికేయుడే కాదు రాజనీతిజ్ఞుడు కూడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కల్చరల్), మే 11: త్రిలోక సంచారిగా ఉన్నతికెక్కిన నారద మహర్షి అందరూ భావిస్తున్నట్టు ఒక్క పాత్రికేయుడే కాదు.. ఆయన మహామనీషి.. ఒక వ్యవస్థ.. అన్నింటికీ మించి గొప్ప కళాకారుడు అంటూ ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత సహకార్యవాహ యుగంధర్ అన్నారు. నారద జయంతిని గడచిన 11 సంవత్సరాలుగా పాత్రికేయుల దినోత్సవంగా జరుపుతున్న భారత్ ప్రకాశన్ ట్రస్టు గురువారం రాత్రి విజయవాడలోని ఒక హోటల్‌లో నిర్వహించిన జాగృతి వారపత్రిక సంపాదకులు వడ్లమూడి రామ్మోహనరావు స్మారక పురస్కార ప్రధానోత్సవ సభలో యుగంధర్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. అవార్డు కమిటీ చైర్మన్ దుగ్గరాజు శ్రీనివాస్ అధ్యక్షత వహించిన ఈ సభలో యుగంధర్ మాట్లాడుతూ నారద మహర్షి అన్ని లోకాలు తిరిగి జ్ఞానాన్ని ప్రసాదింపజేసారని కొనియాడారు. ఆయన ఒక గొప్ప రాజనీతివేత్త కూడా అని అన్నారు. ప్రధానంగా సామాజిక న్యాయం అంటే ఏమిటో తెలియజేసిన మహానుభావుడని ప్రశంసించారు. ఇక వడ్లమూడి రామ్మోహనరావు కనపడని మరో నారదుడంటూ అభివర్ణించారు. ఎమర్జన్సీ సమయంలో రాయలసీమలో ఉంటూ అక్కడి ప్రజల్లో ద్వేషాన్ని తగ్గించేందుకు ఎంతగానో కృషిచేసారని అన్నారు. మూడో కంటికి తెలియకుండా కరపత్రాల ద్వారా తెల్లవారేసరికి విస్తృత సమాచారాన్ని అందింపచేయడంలో కృతకృత్యుడయ్యాడని అన్నారు. నేటి జర్నలిస్టులు సమాజ విలువలను కాపాడుతూ ప్రపంచానికి సన్మార్గం చూపాలన్నారు. కేంద్ర మాజీ మంత్రి, బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురంధ్రీశ్వరి మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ మీడియా ప్రభావం ఎంత పెరిగినప్పటికీ ప్రింట్ మీడియా మారుమూల గ్రామ స్థాయికి కూడా చేరిందన్నారు. అట్టడుగు వర్గాల సమస్యలను కూడా జర్నలిస్టులు బయటి ప్రపంచం దృష్టికి తీసుకువస్తున్నారంటూ ప్రశంసించారు. బిజెపి ఎమ్మెల్సీ వివిఎన్ మాధవ్ మాట్లాడుతూ మాతృభాషలో విద్యాబోధన జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నారద జయంతి సందర్భంగా జర్నలిస్టులను ప్రోత్సహించేలా ట్రస్టు చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. ట్రస్టు అధ్యక్షుడు భూపతి శ్రీనివాసు అధ్యక్షతన జరిగిన ఈ సభలో అవార్డుల కమిటీ చైర్మన్ శ్రీనివాసు, పివి శ్రీరామసాయి, తదితరులు ప్రసంగించారు.
అవార్డుల ప్రదానం
ఈ సందర్భంగా ఆంధ్రభూమి అనంతపురం చీఫ్ సబ్ ఎడిటర్ పతకా శంకరప్రసాద్‌ను ఉత్తర సీనియర్ జర్నలిస్టు అవార్డుతోను, ఆంధ్రభూమి హైదరాబాద్ కార్టూనిస్ట్ ఎన్.రాజశేఖరరెడ్డిని ఉత్తమ కార్టూనిస్ట్ అవార్డుతోను, ఆంధ్రజ్యోతి కర్నూలు ఫొటోగ్రాఫర్ బి.ఆంజనేయులును ఉత్తమ ఫొటోగ్రాఫర్ అవార్డుతోను, సాక్షి చానల్ హైదరాబాద్ జర్నలిస్టు ఎఎస్ జోయల్‌కుమార్‌ను ఉత్తమ చానల్ జర్నలిస్టు అవార్డుతోను ఘనంగా సత్కరించారు.