ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకానికి తూట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 12: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం ‘ఇహెచ్‌ఎస్’కు తూట్లు పొడిచేలా టెక్నికల్ కమిటీ పలు ప్రతిపాదనలను ప్రతిపాదించడం పట్ల ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గుంటూరులోని ఎన్‌టిఆర్ వైద్య సేవ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఇహెచ్‌ఎస్ యాజమాన్య కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనల పట్ల వివిధ సంఘాల ప్రతినిధులు ఆగ్రహోదగ్రులయ్యారు. మొత్తంపై ఈ సమావేశం వాడివేడిగా జరిగింది. ఏ ఒక్క ప్రతిపాదన కూడా తమకు ఆమోదయోగ్యంగా లేదని సంఘాల నేతలు స్పష్టం చేశారు. అసలు గతంలో ఓసారి తీర్మానించిన అంశాల్లో తరచు మార్పులు ఎందుకు జరుగుతున్నాయంటూ మండిపడ్డారు. గతంలో ఆరోగ్యశాఖ మంత్రి, కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాల సంఘం ‘ఆశ’ కలిసి ప్యాకేజీ రేట్లపై తీసుకున్న నిర్ణయాలను తక్షణం అమల్లోకి తెచ్చి పూర్తిస్థాయిలో వైద్యం అందించాలని నాయకులు డిమాండ్ చేసారు. నేటి సమావేశంలో తాము వెలిబుచ్చిన అభిప్రాయాల మినిట్స్‌ను ముఖ్యమంత్రికి, ఆరోగ్యమంత్రికి తక్షణం పంపాలని, ఆపై నేరుగా సిఎంను కలిసి స్టీరింగ్ కమిటీ నిర్ణయాల అమలుకు పట్టుబడతామని ఎన్‌జివో సంఘ అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు, యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వెంకటేశ్వరరావు, ఆంధ్రభూమి ప్రతినిధితో అన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా జనవరి 13తేదీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ స్పష్టతలేని నిర్ణయాలతో ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఈ పథకం పూర్తిస్థాయిలో వినియోగంలోకి రానందున ఉద్యోగులందరూ చాలా అసహనంతో ఉన్నారని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో మరోసారి పూర్తిస్థాయి సమావేశం నిర్వహిస్తే కాని ఈ పథకం విజయవంతం కాదన్నారు.
ఎన్టీఆర్ హెల్త్ ట్రస్ట్ సిఇవో డాక్టర్ రవిశంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎపి జెఎసి చైర్మన్ పి.అశోక్‌బాబు, సెక్రటరీ జనరల్ ఐ.వెంకటేశ్వరరావు (యుటిఎఫ్), ఎపి జెఎసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రటరీ అంజిప్రసాద్, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం జోసెఫ్ సుధీర్ (ఎస్‌టియు), ఎం.కమలాకరరావు (పిఆర్‌టియు), ఎన్‌జివో సంఘ ప్రధాన కార్యదర్శి ఎన్.చంద్రశేఖరరెడ్డి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. మాస్టర్ హెల్త్ చెకప్ పరీక్షలు, అలాగే ప్యాకేజీ రేట్లకు సంబంధించి టెక్నికల్ కమిటీ సిఫార్స్‌లపై ఎన్‌టిఆర్ వైద్యసేవ టెండర్లను ఆహ్వానించగా మోడల్ కాల్‌హెల్త్ ఏజెన్సీల ప్రతినిధులు నేటి సమావేశానికి హాజరై తమ సేవలు వివరించారు. గతంలో మేనేజ్‌మెంట్ కమిటీ, స్టీరింగ్ కమిటీలు రెండూ ఆమోదించిన విధంగా ప్రభుత్వం 2014 అక్టోబర్ 29న 135 నెంబర్‌లో ఓ జీవో జారీ చేసింది. ఈ ప్రకారం క్రానిక్ వ్యాధులకు ఔట్ పేషెంట్ వైద్యం, పురుషులకు 31, మహిళలకు 33 వైద్య పరీక్షలు, 40 ఏళ్ల పైబడిన సర్వీస్ ఉద్యోగుల పెన్షన్లు, వారి భార్య లేదా భర్తకు ఏడాదికోసారి నోటిఫై ఆసుపత్రుల్లో మాస్టర్ హెల్త్ చెకప్‌కు ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఎకో, ట్రెడ్‌మిల్ వంటి గుండె పరీక్షలతో సహా మొత్తం 15 రకాల పరీక్షలను ఈ పథకం నుంచి తొలగించడంపై నాయకులు మండిపడ్డారు. పైగా ఏడాదికోసారి జరుగాల్సిన పరీక్షలను రెండేళ్లకు మార్చడంపై కూడా నిరసన వ్యక్తం చేసారు. అసలు ఇందులో వైద్యశాఖకు వైద్యుడు కాని కన్సల్టెంట్ జితేంద్ర శర్మ నిర్వాకం ఏమిటి, గత నిర్ణయాలు ఎందుకు మారాయి, ఎవరు మార్చారో చెప్పాలంటూ పట్టుబట్టారు.
కొన్ని ముఖ్యమైన పరీక్షలను తొలగించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. గతంలో ప్రభుత్వం మాస్టర్ హెల్త్ ప్యాకేజీ అమలుకు ఓ కమిటీ, రేట్లకు సంబంధించి మరో కమిటీని నియమించింది. ఈ కమిటీలు 40 ఏళ్లలోపు ఉద్యోగులు వారి భార్య, లేదా భర్తకు వైద్య పరీక్షలు, వీరిలో 30 ఏళ్లు పైబడిన మహిళలకు అదనంగా లిక్విడ్ బేస్‌డ్ పరీక్షలు జరపాలని, పెన్షనర్లు వారి భార్య లేదా భర్తలకు పై వ్యాధులన్నింటికీ ఒన్‌టైమ్ హెల్త్ చెకప్ చేయాలని సిఫార్స్ చేసింది. ఇక రేట్లకు సంబంధించి కమిటీ హెమటోలాజికల్ బయో కెమికల్ పరీక్షకు ఒక్కరికి రూ.235లు, ఎక్స్‌రే రూ.71లు, ఇసిజి (12 లాడ్స్) రూ.51లు, సోనో మమ్మోగ్రామ్ 30 ఏళ్లు పైబడిన మహిళలకు రూ.381లు, పాప్‌స్మియర్ (30 ఏళ్లు పైబడిన మహిళలకు) రూ.237లు రేట్లను సిఫార్స్ చేసింది. అయితే ఈ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయనే కారణంతో నెట్‌వర్క్ ఆసుపత్రులు ఎన్టీఆర్ వైద్యసేవ నోటిఫికేషన్‌కు స్పందించలేదని నాయకులు ధ్వజమెత్తారు. థైరాయిడ్‌కు సంబంధించి టి3, టి4, టిఎస్‌హెచ్, సీరం విటమిన్ డి 3 లెవల్స్, 2డి ఎకో, ట్రెడ్‌మిల్ టెస్ట్, హెచ్‌బి ఎ1-సి, హెచ్‌ఐవి లాంటి ముఖ్యమైన పరీక్షలు తొలగించడంపై మండిపడ్డారు. అసలు గతంలో ఆరోగ్యమంత్రి, ఆసుపత్రుల యాజమాన్యం కల్సి నిర్ణయించిన ప్యాకేజీ రేట్లను అమల్లోకి తేవాలని డిమాండ్ చేసారు.