ఆంధ్రప్రదేశ్‌

రైతులకు రూ. 1546 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 13: ప్రకృతి విపత్తులు, కరవు, భారీ వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ. 1546.62 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు. 2014-15 నుంచి 2016-17 మధ్య కాలంలో సంభవించిన హుదుద్ తుపాను, 2014 ఖరీఫ్‌లో వచ్చిన కరవు, ఆకాల వర్షాలు తదితర వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు మొత్తం రూ. 3573.34 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. అందులో ఇప్పటి వరకు రూ. 1546.62 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించామని, మిగిలిన రూ. 2026.72 కోట్లకు సంబంధించి ప్రతిపాదనలు పంపామని, కేంద్రం ఈ నిధులు విడుదల చేయగానే ఈ సబ్సిడీని రైతులకు అందజేస్తామని వెల్లడించారు.
కడపకు రూ. 59.02 కోట్ల పంపిణీ
కడప జిల్లాలో ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం సంవత్సరాలకు రూ. 59.02 కోట్ల ఇన్‌పుడ్ సబ్సిడీ చెల్లించింది. నష్టపోయిన రైతులకు మొత్తం రూ. 180.99 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. రైతులకు ఇంకా రూ. 121.97 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించాల్సి ఉంది. అందులో 2016లో కరవు వల్ల నష్టపోయిన రైతులకు చెల్లించాల్సిన రూ. 77.01 కోట్ల ప్రతిపాదనలు, భారీ వర్షాల వల్ల నష్టం రూ. 44.58 కోట్ల ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపారు. కేంద్రం ఈ నిధులు విడుదల చేయగానే ఈ సబ్సిడీ నిధులను రైతులకు అందజేస్తామని తెలిపారు. 2017 ఆర్థిక సంవత్సరంలో 2015 కరవు వల్ల నష్టపోయిన వారికి రూ. 25.06 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ నిధులు పంపిణీ చేస్తారు. అందులో రూ. 24.41 కోట్లు ఇప్పటికే 6.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మిగిలిన రూ. 1.19 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ పునః మూల్యాంకన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం సమర్పించింది. ఈ నిధులు విడుదల చేయాలని కేంద్రానికి కోరినట్లు మంత్రి తెలిపారు.
అనంతపురానికి రూ. 568.31 కోట్లు
తీవ్ర కరవుతో నష్టపోయిన అనంతపురం రైతులకు 2014-15 నుంచి 2016-17 సంవత్సరం వరకు మొత్తం రూ. 568.31 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ప్రభుత్వం చెల్లించింది. పంట నష్టపోయిన రైతులకు మొత్తం రూ. 1624.55 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని చెల్లించాలని కోరుతూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు. మరో రూ. 1056.24 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉంది. ఇందులో 2016లో ఏర్పడిన కరవు నష్టం ప్రతిపాదనలు రూ. 1032.24 కోట్లు, భారీ వర్షాల నష్టం ప్రతిపాదనలు రూ. 23.81 కోట్లున్నాయి. ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది. కేంద్ర ఈ నిధులు విడుదల చేయగానే రైతులకు ఈ ఇన్‌పుట్ సబ్సిడీ అందజేస్తామని వివరించారు. కర్నూలు జిల్లాకు సంబంధించి రూ. 326.14 కోట్ల ప్రతిపాదనలు పంపామన్నారు.