ఆంధ్రప్రదేశ్‌

జగన్ మోదీని కలిస్తే తప్పేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: ప్రధాని నరేంద్ర మోదీని ఎపి రాష్ట్ర ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ కలిస్తే మీరెందుకు ఉలిక్కిపడతారని వైఎస్‌ఆర్‌సిపి నేత బొత్స సత్యనారాయణ ఎపి సిఎం చంద్రబాబు, టిడిపి నేతలను ప్రశ్నించారు. ప్రధానిని కలిస్తే ఇందులో తప్పేముందని నిలదీశారు. ఆదివారం నాడిక్కడ ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకర్ల సమావే శంలో మాట్లాడారు. మీరు ప్రధానిని కలవడం అంటే ఓటుకు కోట్లు కేసు కోసమే కలుస్తున్నారని అనుకోవాలా..? అంటూ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. జగన్ ప్రధానిని కలవడం వల్ల ఎక్కడ తన అవినీతి బండారం బయట పడుతుందోనని చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారని ఆరోపించారు. రాష్టప్రతి ఎన్నికలకు ముందు ప్రధానిని కలవడం ఏమిటని ప్రశ్నించడాన్ని ఆయన తప్పుపట్టారు. తాము గతంలోనే ప్రధానిని అపాయింట్‌మెంట్ కోరిన విషయాన్ని బొత్స గుర్తు చేశారు. రైతుల సమస్యలతో పాటు ఎన్నో సమస్యలు రాష్ట్రంలో ఉంటే వాటిని గాలికొదిలి జగన్‌పై విమర్శలు చేయడం అర్థం లేనిదని అన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు గాలికొదిలేసినా జగన్ పట్టుదలతో ప్రధానిని కలిసి ప్రత్యేక హోదా అంశంపై ప్రధానితో మాట్లాడారని అన్నారు. చంద్రబాబు వైఖరి వల్ల ఇబ్బంది పడ్డవాళ్లెవరో ఆయన విదేశాల్లో ఉండగా మెయిల్ చేసి ఉండవచ్చని బొత్స అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ వైఫల్యం వల్లే విశాఖలో హవాలా కుంభకోణం వెలుగు చూసిందని తెలిపారు. చంద్రబాబు తన విదేశీ పర్యటన వల్ల ఎపికి ఒరిగింది ఏమిటో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. సొంత వ్యాపారాలు, తాబేదారుల వ్యాపారుల ప్రయోజనాల కోసం విదేశీ పర్యటనలకు వెళ్ళినట్లు ఉంది తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమాత్రం కాదని అన్నారు.