ఆంధ్రప్రదేశ్‌

రూ.4కే ‘రాజన్న క్యాంటీన్’ భోజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, మే 14: పేదవారెవరూ ఆకలితో అలమటించకూడదని, పేదవాడు గొప్పవాడు కావాలని, రైతే రాజు కావాలని ప్రతిక్షణం చెబుతూ దానికి అనుగుణంగా పనిచేసిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి అండదండలతో మంగళగిరి నియోజకవర్గంలో నిత్యం పేదలకు నాలుగు రూపాయలకే భోజనం అందించే పథకాన్ని ప్రారంభించినట్లు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అంబేద్కర్ విగ్రహం సెంటర్‌లో ఆదివారం రాజన్న క్యాంటీన్ ద్వారా నాలుగు రూపాలయకే పేదలకు భోజనం అందించే పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఆహారాన్ని మొబైల్ వాహనం (రాజన్న క్యాంటీన్) ద్వారా తెచ్చి కోడిగుడ్డు, సాంబారన్నం, పెరుగన్నం, మంచినీటి ప్యాకెట్‌ను నాలుగు రూపాయలకే అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే విలేఖర్లతో మాట్లాడుతూ మూడేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో 44వ పేజీలో రాష్టవ్య్రాప్తంగా ‘అన్న క్యాంటీన్’లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. పేదలకు ఐదు రూపాయలకే భోజనం, రూపాయికి ఇడ్లీ అందజేస్తామని టిడిపి నాయకలు ప్రచారం చేయటంతో ప్రజలు నిజమని నమ్మి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేశారన్నారు. వారంలో నాలుగురోజులు సాంబారన్నం, పెరుగన్నంతో పాటు కోడిగుడ్డు, మిగతా మూడురోజులు అరటిపండు అందజేస్తామని తెలిపారు. నిత్యం 500 మంది వరకు భోజనం అందించే ఏర్పాట్లు చేశామన్నారు. మరో ఐదారు నెలలు వేచిచూసి చంద్రబాబు స్పందించకపోతే వైసిపి ఆధ్వర్యాన రూపాయికి నాలుగు ఇడ్లీలు అందించే పథకాన్ని కూడా ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు. రాజన్న క్యాంటీన్ అంబేద్కర్ సెంటర్‌కు చేరుకోగానే పేదలు క్యూలో నిలబడి నాలుగు రూపాయలు చెల్లించి సంతృప్తిగా భోజనం చేసి వెళ్లారు. ఎమ్మెల్యే ఆర్కే స్వయంగా వారికి భోజనం ప్లేట్లు అందించారు.

చిత్రం..పేదలకు భోజనం అందజేస్తున్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి