ఆంధ్రప్రదేశ్‌

18న రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ నూతన కార్యాలయం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), మే 15: రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా బ్రాహ్మణ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడ గొల్లపూడిలోని దేవాదాయ కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలో ఈ నెల 18న నూతన భవనాన్ని మంత్రి మాణిక్యాలరావు, కార్పొరేషన్ చైర్మన్ ఐవై ఆర్ కృష్ణారావు ప్రారంభిస్తారని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరిపురపు శ్రీ్ధర్, అధ్యక్షుడు బలరాం కృష్ణమూర్తి తెలిపారు. ఆదివారం స్థానిక బ్రాడీపేటలోని సింధూరి సమావేశ మందిరంలో సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ్ధర్ మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు, దేశ మాజీ ప్రధాని పివి నరసింహారావుల కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే నామినేటెడ్ పదవులలో బ్రాహ్మణులకు తగు ప్రాధాన్యతనివ్వాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ముత్తనపల్లి ప్రసాద్, నాయకులు తుళ్లూరు ప్రకాష్, గాలి శ్రీనివాసరావు, ఎన్ నరసింహమూర్తి, కోనంకి మారుతి, దండెంరాజు హనుమంతరావు, సాగి శ్రీనివాసశాస్ర్తీ, ఫణిశేష శయన్, రాంబాబు, వేదాందం హరనాధ్, తణుకు రామకృష్ణ, పవన్, వై శబరి, వడ్లమూడి రాజు తదితరులు పాల్గొన్నారు.