ఆంధ్రప్రదేశ్‌

మోదకొండమ్మ సేవలో గిరిజన మంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, మే 14: విశాఖ మన్యంలో గిరిజన, గిరిజనేతరుల ఆరాధ్య దైవమైన పాడేరు మోదకొండమ్మ అమ్మవారిని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి నక్కా ఆనందబాబు ఆదివారం సాయంత్రం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక మోదకొండమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ కమిటీ ప్రతినిధులు ఆధ్యాత్మిక లాంఛనాలతో ఘనంగా స్వాగతం పలికారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా విశాఖ ఏజెన్సీ పర్యటనకు వచ్చిన ఆయన ముందుగా మోదాపల్లి వద్ద ఉన్న అమ్మవారి పాదాలను, పాడేరులో ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సతకంపట్టును దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు, అరకులోయ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు, ఐ.టి.డి.ఎ ప్రాజెక్టు అధికారి పి.రవిసుభాష్, ఆర్.డి.ఒ. వేణుగోపాలరావు, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..మోదకొండమ్మ అమ్మవారికి పూజలు చేస్తున్న గిరిజన శాఖ మంత్రి ఆనందబాబు