ఆంధ్రప్రదేశ్‌

‘లీకు’ వీరులెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 15: జగన్ ఇచ్చిన వినతిపత్రాన్ని ప్రధాని లీక్ చేయాలి. ఆయన ఆ పని చేయరు. ఇక చేస్తే జగన్ చేయాలి. ఆయనకు ఆ అవసరం ఉండదు. ఇక లీక్ ఎవరు చేశారు? అంత అవసరం ఎవరికి ఉంటుంది? పీఎంఓతో సన్నిహితంగా వ్యవహరించేంత ప్రభావశాలురు ఎవరు? అసలు ఆ వినతిపత్రం మీడియాకు ఎలా వచ్చింది? ఎవరి ద్వారా అందింది? ఏ స్థాయిలో అది లీకయింది? సహజంగా రాజకీయ పార్టీల అధ్యక్షులు, ప్రముఖులు ప్రధానిని కలిసే సందర్భంలో భిన్నమైన వినతిపత్రాలు, ఫిర్యాదులు చేస్తుంటారు. ప్రధాని అందుబాటులోకి రాకపోతే తమ లేఖను పీఎంఓకు ఇస్తుంటారు. తమ వాదనకు మద్దతుగా ఉన్న ఆధారాలు జతపరుస్తుంటారు. తర్వాత ప్రధాని వాటిని పీఎంఓ అధికారుల పరిశీలనకు పంపుతుంటారు. సదరు ప్రముఖుల వినతిపత్రాల అంశాలపై తమ స్పందన, పురోగతిని పీఎంఓ లిఖితపూర్వకంగా వారికి లేఖ రూపంలో పంపుతుండటం రివాజు. అయితే, సదరు ప్రముఖులు ఇచ్చిన లేఖలు, వినతిపత్రాలేవీ బయటకు పొక్కనీయరు. అవన్నీ పీఎంఓలోనే భద్రపరుస్తుంటారు. కానీ, ఏపికి చెందిన ప్రతిపక్ష నేత జగన్ ఇచ్చిన వినతిపత్రం డాక్యుమెంటు సహా బట్టబయలు కావడం రాజకీయ వర్గాలను దిగ్భ్రమ పరిచింది. తాజా లీక్ వ్యవహారం తెలుగు మీడియాలో ప్రముఖంగా రావడంతో బిత్తరపోయిన రాష్ట్ర బిజెపి నేతలు కొందరు ఈ విషయాన్ని బిజెపి నాయకత్వానికి చేరవేశారు. వారు సైతం దీనిపై విస్మయం వ్యక్తం చేసి, దానిపై శోధన ప్రారంభించినట్లు సమాచారం. ఇది ఏ స్థాయిలో జరిగింది? ఎలా లీకయింది అన్న అంశంపై విచారణ ప్రారంభించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘దానిపై మా పార్టీ సీరియస్‌గా ఉంది. త్వరలో ఫలితాలు మీరే చూస్తార’ని ఓ సీనియర్ నాయకుడు చెప్పారు. ఇదిలాఉండగా అసలు ఆ లేఖ తాజాగా జరిగిన భేటీలో ఇచ్చింది కాదని ఫిబ్రవరి 17న రాసిన లేఖ అని, దానికి ఏప్రిల్ 17న పీఎంఓ నుంచి జవాబు వచ్చిందని, తాము ప్రధానిని కలిసి ఇచ్చిన వినతిపత్రం మే 10న అని వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి సోమవారం మీడియాకు వెల్లడించారు. నాటి లేఖను సంపాదించి, దానిని మొన్నటి భేటీకి ముడిపెట్టిన ఆ పత్రిక, చానెల్‌పై క్రిమినల్ చర్యలుంటాయని చెప్పారు. తాజాగా సోమవారం రాత్రి మీడియాతో మాట్లాడిన జగన్ కూడా అదే చెప్పి నాటి లేఖలు విడుదల చేశారు. అదే నిజమనుకున్నా ఆ లేఖ కూడా పీఎంఓ నుంచి ఎలా లీకయిందన్న ప్రశ్నకు జవాబు విచారణలో తేలాల్సి ఉంది. రాష్ట్ర బిజెపి ప్రముఖులు చెబుతున్నదాని ప్రకారం.. తెలుగుదేశం అనుకూల వర్గానికి చెందిన కొందరు ప్రముఖులకు పీఎంఓతో సంబంధాలున్నాయని, వారే సదరు మీడియాకు లీక్ చేసి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు మీడియా చాలాకాలం నుంచి బిజెపి, మోదీతోపాటు రాష్ట్రంలో తెలుగుదేశం వ్యతిరేక వైఖరితో ఉన్న నాయకులపై ఒక వ్యూహం ప్రకారం దుష్ప్రచారం చేస్తోందని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ప్రధాని కార్యాలయ లొసుగును బట్టబయలు చేయగా, ఢిల్లీలో ఉంటూ చక్రం తిప్పుతున్న పలువురు ప్రముఖులను ఆత్మరక్షణలో పడేసిందన్న వ్యాఖ్యలు బిజెపి వర్గాల్లో వినిపిస్తున్నాయి.