ఆంధ్రప్రదేశ్‌

నరేగా నత్తనడకపై బాబు ఆగ్రహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 15: ఉపాధిహామీ పథకం (నరేగా) పనులు గత ఏడాది కన్నా ఈ ఏడాది మందకొడిగా జరగడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యమ స్ఫూర్తిగా చేపట్టాలని పిలుపిచ్చినా వేగం లేకపోవడంపై ఆయన ఆగ్రహించారు. నిర్లిప్తత వల్ల అనేక సమస్యలు వస్తాయని, అలసత్వం అనర్థాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ‘నీరు-ప్రగతి’ పురోగతిపై సోమవారం సిఎం చంద్రబాబు, సిఎస్ దినేష్‌కుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో భూగర్భ జలాలు ప్రస్తుతం 14.5 మీటర్ల దిగువన ఉన్నాయన్నారు. నీరు-ప్రగతి ద్వారా వీటిని 6.5 మీటర్ల ఎగువకు తీసుకురావాల్సి ఉందని గుర్తుచేశారు. రుతుపవనాలకు ముందు 8మీటర్లు, తరువాత 3మీటర్ల దిగువన భూగర్భ జలాలు ఉండాలనేది మన లక్ష్యంగా పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల పంట కుంటల తవ్వకం, 20వేల చెక్ డ్యాముల నిర్మాణం లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. నీటి సమస్య అధిగమిస్తే 15శాతం వృద్ధి సులభ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 24 గంటలు నీటి కోసం వెదుక్కునే పరిస్థితి ఉండకూడదని ముఖ్యమంత్రి అన్నారు. పోయిన కాలం మళ్లీ రాదన్నారు. 15 రోజుల్లో వర్షాలు పడితే పంట కుంటల తవ్వకం పనులకు బ్రేక్ పడుతుందంటూ, తక్షణమే పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రపంచం అంతా శాస్త్ర సాంకేతికతతో ఎంతో ముందుకు పోతుంటే, మనం పంట కుంటలే తవ్వలేకపోవడం శోచనీయమన్నారు.
నాయకులు, ఉద్యోగులు, ఎవరికైనా ‘ప్రజలే ప్రథమం (పీపుల్ ఫస్ట్)’ అనేది ఎల్లవేళలా గుర్తుంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు. రాజకీయ తోడ్పాటు ప్రజా ప్రతినిధులు ఇస్తారంటూ, పాలనాపర తోడ్పాటు ఇవ్వాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపైనే ఉందన్నారు. అన్ని స్థాయిల్లో బాధ్యతాయుత పరిపాలన అందించాలన్నారు. ప్రతి శాఖ పనితీరును విశే్లషిస్తానంటూ, ప్రతి అధికారి పనితీరును బేరీజు వేస్తానన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంగా పనిచేసి సమర్ధత, అంకితభావం చూపాలని, చిత్తశుద్ధితో సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎవరికి వారు స్ఫూర్తిదాయకంగా పనిచేయాలన్నారు.
కలెక్టర్లు వ్యక్తిగత శ్రద్ధ చూపాలి
ఇంకా 40 రోజులే సమయం ఉంది, వెంటనే నీరు-ప్రగతి నులు వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఆదేశించారు. పంట కుంటల తవ్వకంపై జిల్లా కలెక్టర్లు వ్యక్తిగత శ్రద్ధ చూపాలన్నారు. ‘వారానికి వెయ్యి కుంటలు’ లక్ష్యంతో కృష్ణాజిల్లా ముందుకెళ్లడాన్ని అభినందించారు. రాబోయే 8వారాల్లో 12వేల పంట కుంటల తవ్వకం లక్ష్యాన్ని కృష్ణాజిల్లా చేరుకోవాలన్నారు. రాయలసీమ జిల్లాలలో నీరు-ప్రగతి పనులు మరింత వేగం పుంజుకోవాలన్నారు. ఎన్టీఆర్ జలసిరి కింద పూర్తిచేసిన బోర్లకు విద్యుదీకరణ వెంటనే చేయాలన్నారు. శ్రీకాకుళం, నెల్లూరు, పశ్చిమగోదావరి, సీమ జిల్లాల్లో నరేగా పనులను వేగవంతం చేయాలన్నారు. అన్ని జిల్లాల్లో పక్కా ఇళ్ల నిర్మాణం పనులను వేగవంతం చేయాలన్నారు. గిరిజన తండాల్లో విద్యుత్ సౌకర్యం లేని ఇళ్లను గుర్తించి వెంటనే విద్యుదీకరణ చేయాలన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్ కమిషనర్ రామాంజనేయులు, జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, వివిధ జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.