ఆంధ్రప్రదేశ్‌

వచ్చే జనవరి నాటికి మట్టిపనులు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 15: వచ్చే జనవరి నాటికి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 90 శాతం మేర మట్టిపనులు పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రగతిపై సోమవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సిఎం మాట్లాడుతూ నీటి పారుదల రంగంలో అనేక మార్పులకు కాటన్ దొర శ్రీకారం చుట్టారంటూ నివాళులు అర్పించారు. దేశం కాని దేశంలో సేవలు అందించారని కొనియాడారు. కాటన్ స్ఫూర్తితో తర్వాతి తరం పాలకులు నడచుకుని ఉంటే కరవు అనేదే ఉండేది కాదన్నారు. గోదావరి జిల్లాల ప్రజలు కాటన్ దొరను తమ కుటుంబ సభ్యునిగా భావించడానికి ఆయన అందించిన సేవలే కారణమన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డయాఫ్రం వాల్ లక్ష్యాన్ని నూరు శాతం చేరుకోగలిగామన్నారు. ప్రాజెక్టు పనుల్లో జాప్యం వద్దని, లక్ష్యాలను సకాలంలో సాధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

చిత్రం..పోలవరం ప్రాజెక్ట్ పనులను సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు