ఆంధ్రప్రదేశ్‌

నంద్యాల ఉప ఎన్నిక మరింత ఆలస్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, మే 16: కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తొలుత రాష్టప్రతి ఎన్నిక లోగా ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన భావించినా సమయాభావం వల్ల నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్టప్రతి ఎన్నిక తరువాతే నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక జరిగే అవకాశాలున్నాయని రాజకీయ విశే్లషకులు అంటున్నారు. ఆనవాయితీ ప్రకారం రాష్టప్రతి ఎన్నిక నోటిఫికేషన్ జూన్ 2వ వారంలో వచ్చే అవకాశాలున్నట్లు ప్రసారమాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. రాష్టప్రతి ఎన్నిక కోసం ఇప్పటి వరకు ఏడుసార్లు జూన్ నెలలోనే నోటిఫికేషన్ జారీ అయింది. 2007, 2012లో జరిగిన రాష్టప్రతి ఎన్నికలకు జూన్ 16వ తేదీ నోటిఫికేషన్ విడుదల చేశారు. జూలై 19 నాటికి ఎన్నిక పూర్తి చేశారు. అంతేగాక ఇప్పటి వరకు 7 సార్లు జూన్ 2వ వారంలోనే రాష్టప్రతి ఎన్నిక నోటిఫికేషన్ విడుదల అవుతూ వచ్చింది. ఈసారి కూడా జూన్ 16వ తేదీ రాష్టప్రతి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి మార్చి 12వ తేదీ గుండెపోటుతో మృతి చెందారు. నాగిరెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీకి ఆనవాయితీ ప్రకారం ఆరు నెలల్లో ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే రాష్టప్రతి ఎన్నికల నేపధ్యంలో దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పార్లమెంటు స్థానాలు, అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉండడంతో నంద్యాల అసెంబ్లీ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలన్న విషయం ఉత్కంఠ భరితంగా మారిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమెరికా పర్యటన అనంతరం అభ్యర్థి ఎంపిక జరుగుతుందని ప్రకటించారు. బాబు అమెరికా నుండి తిరిగి వచ్చి మూడు రోజులైనా ఇప్పటి వరకు నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రస్థావన జరగలేదు. దీనికి తోడు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నిక నోటిఫికేషన్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. రాష్టప్రతి ఎన్నికల నోటిఫికేషన్ జూన్ నెల 2వ వారంలో విడుదలైతే ఆలోపు నంద్యాల అసెంబ్లీ ఎన్నిక సాధ్యమవుతుందా అని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.