ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీ భద్రత డొల్ల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 16: రాష్ట్ర అసెంబ్లీ కల్పిస్తున్న భద్రతా ఏర్పాట్లలో డొల్లతనం మరోసారి బయటపడింది. అసెంబ్లీ మీడియా గ్యాలరీలోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించి కెమెరాలతో ఫొటోలు తీసిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. అసెంబ్లీ అవరణ, పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు (ఎస్‌పిఎఫ్) పర్యవేక్షిస్తుంది. ఇందుకు స్థానిక జిల్లా పోలీసు యంత్రాంగం సహకరిస్తుంది. అన్ని గుర్తింపు పత్రాలు ఉన్నప్పటికీ మీడియాను, ఇతరులను అనేక ఇక్కట్లకు గురి చేసే భద్రతా సిబ్బంది నిషేధిత ప్రాంతంలో ఇద్దరు వక్తులు కెమెరాలను తీసుకువెళుతున్నా గుర్తించకపోవటం గమనార్హం. అసెంబ్లీ మీడియా గ్యాలరీలో ఇద్దరు వ్యక్తులు కెమెరాలతో ఫొటోలు తీయడాన్ని సిసి కెమెరాల ద్వారా గమనించిన భద్రతా సిబ్బంది ఉరుకులు పరుగుల మీద వచ్చి వారిద్దనీ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని వదిలివేశారు. మీడియా గ్యాలరీలోకి కెమెరాను అనుమతించరు. కానీ అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవడంతో కెమెరాలతో వెళ్లారు. దీంతో భద్రతా ఏర్పాట్లలో డొల్లతనం బయడపడింది. గతంలో మంత్రి నారా లోకేష్ భద్రతా సిబ్బందిని ఆయుధాలతో అసెంబ్లీ ఆవరణలోకి అనుమతించడం కూడా చర్చనీయాంశమైంది.