ఆంధ్రప్రదేశ్‌

పట్టుకోసం 120 రోజులు అడిగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 16: రాబోయే 45 రోజులు తనకు చాలా కీలకమని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. మంగళవారం ఉదయం ఆయన అసెంబ్లీ ఆవరణలో విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ప్రస్తుతం పార్టీ పనులు అన్నీ అధినేత చంద్రబాబునాయుడే చూస్తున్నారన్నారు. మరో 120 రోజుల తర్వాత పార్టీ పనులపై దృష్టి పెడతానన్నారు. తన శాఖపై పట్టు సాధించిన అనంతరం పార్టీ వ్యవహారాలపైనా దృష్టి కేంద్రీ కరిస్తానన్నారు. వేసవిలో తాగనీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. శాఖలపై పట్టు సాధించేందుకు 120 రోజుల సమయం కోరానని చెప్పారు. రాష్ట్రానికి రాబోయే ఐటీ కంపెనీలను ఇక విశాఖలోనే ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. హెచ్‌సిఎల్‌తో పాటు మరో రెండు, మూడు కంపెనీలు రాష్ట్రానికి వస్తాయన్నారు. దీంతో మొత్తం 15వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయన్నారు. విశాఖలో ఐటీ ఉద్యోగులు ఎక్కువ మంది ఉన్నారని, రాబోయే ఐటీ కంపెనీలు విశాఖలోనే ఏర్పాటు చేస్తామన్నారు. హెచ్‌సిఎల్ ఉద్యోగుల్లో 30 శాతం మంది తెలుగువారేనని శివనాడార్ చెప్పారన్నారు.