ఆంధ్రప్రదేశ్‌

ఇక విలేజ్ వాటర్ బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 16: గ్రామాల్లో శాశ్వతంగా మంచినీటి సమస్యను అధిగమించేందుకు ఇకపై విలేజ్ వాటర్ బడ్జెట్‌ను తయారు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మంగళవారం పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి సమస్య పరిష్కారానికి తాత్కాలిక చర్యలతో పాటు శాశ్వత చర్యలూ తీసుకుంటామన్నారు. ఈ బడ్జెట్ కింద అవసరమైన నిధులను విడుదల చేస్తామని తెలిపారు. ఇది ఒక వినూత్న ప్రయోగమన్నారు. గ్రామాల్లో భూగర్భ జలాలను వీలైనంతగా పెంచాలన్న సిఎం ఆదేశాల మేరకు ఈ బడ్జెట్ ప్రతిపాదన చేస్తున్నామన్నారు. వర్షాకాలంలో గ్రామాల్లో భూగర్భ జలాలను 3 మీటర్లకు, మిగిలిన కాలంలో 8 మీటర్లకు అందుబాటులో ఉండేలా పెంచడమే ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు. వర్షపు నీరు ఇంకే పరిమాణంపై శాస్ర్తియ అధ్యయనం చేసి, నీటి సమస్య తలెత్తకుండా చూస్తామన్నారు. గ్రామాల్లో లింక్ రోడ్లు, తదితర అంశాలపై చర్చించారు. ఉపాధి హామీ పథకం కింద వేతనం పెంపు, పనిదినాల పెంపు అంశాలపై కేంద్రంతో చర్చిస్తానని తెలిపారు. సమీక్షలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ పునేఠా, పిఆర్ కమిషనర్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వివిధ వర్గాల ప్రజల నుంచి వినతుల స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.