ఆంధ్రప్రదేశ్‌

పసుపు పండుగ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి నుంచి 3 రోజులు మహానాడు తెదేపా శ్రేణులకు బాబు దిశా నిర్దేశం
అభివృద్ధిని ప్రజలకు వివరించే యోచన 24 ముఖ్య తీర్మానాలపై విస్తృత చర్చ
30 వేల మంది ప్రతినిధులకు ఆతిథ్యం విశాఖ కేంద్రంగా మూడోసారి నిర్వహణ

విశాఖపట్నం, మే 26: తెదేపా భవిష్యత్ కార్యాచరణ, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం ప్రధాన అజెండాగా ఆ పార్టీ మహానాడు జరగబోతోంది. విశాఖలో శనివారం నుంచి మూడు రోజులపాటు మహానాడు జరుగుతుంది. పార్టీ ఆవిర్భవించిన తరువాత విశాఖలో జరుగుతున్న మూడో మహానాడు ఇది. 1984లో విశాఖ మున్సిపల్ స్టేడియంలో ఎన్టీ రామారావు అధ్యక్షతన విశాఖలో తొలిసారి మహానాడు జరిగింది. 2001లో విశాఖ పోర్టు స్టేయంలో రెండోసారి మహానాడు జరిగింది. గత సమావేశాలకు భిన్నంగా ఈ మహానాడు జరుగుతోందని పార్టీ నేతలు చెపుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఈ వేదిక నుంచే ప్రజలకు వివరించనున్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఏవిధంగా తీసుకువెళ్లాలి? ప్రతిపక్షాలను ఏవిధంగా ఎదుర్కోవాలో పార్టీ శ్రేణులకు అధినేత దిశా నిర్దేశం చేయనున్నారు. అలాగే వచ్చే రెండేళ్లలో చేపట్టనున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలపైనా పార్టీ జాతీయాధ్యక్షుడు, సిఎం చంద్రబాబు వివరించనున్నారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాలను ఈ మహానాడులో విస్తృతంగా చర్చించనున్నారు. టిడిపితో పొత్తు వద్దని బిజెపి శ్రేణులు సాక్షాత్తూ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఎదుటే ఆందోళన నిర్వహించారు. బిజెపిలోని ద్వితీయ, తృతీయశ్రేణి నాయకులు కూడా తెదేపాతో తెగతెంపులు చేసుకోమని అధిష్ఠానానికి సూటిగానే చెబుతున్నారు. దక్షిణాదిన బిజెపి ఒంటరి పోరుకు సిద్ధమైతే, అందుకు అనుగుణంగా టిడిపి అనుసరించాల్సిన వైఖరి గురించీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ మహానాడులో బిజెపితో పొత్తు గురించి మాట్లాడొద్దని చంద్రబాబు అక్కడి నేతలకు చెప్పినా, ఏపీలో ఆ పార్టీతో పొత్తు కొనసాగింపుపై చంద్రబాబు ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. అలాగే, రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను పరిష్కరించడంలో కేంద్రం కినుకు వహిస్తోంది. ప్రత్యేక హోదాకు బదులు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చింది. ఇది చంద్రబాబు వైఫల్యంగా పేర్కొంటూ వైకాపా రాష్టవ్య్రాప్తంగా మరోసారి ఉద్యమిస్తోంది. దీనిపై చంద్రబాబు ఈ వేదికపై నుంచి ఎటువంటి ప్రకటన చేస్తారోనని అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. పనిలో పనిగా వైకాపాను పూర్తిస్థాయిలో ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర, జాతీయ రాజకీయాలను క్రోడీకరిస్తూ, టిడిపి భవిష్యత్ కార్యాచరణపై కీలక రాజకీయ తీర్మానం చేయనుంది.
రాష్ట్రంలో అవినీతి రహిత పాలన, 80 శాతం ప్రజల సంతృప్తి, సంక్షేమ కార్యక్రమాలు, పరిశ్రమల స్థాపనకు చేస్తున్న కృషి, నిరుద్యోగ నిర్మూలన వంటి అంశాలపై ఈ మహానాడులో చర్చించనున్నారు. ముఖ్యంగా నదుల అనుసంధానం, పోలవరం ప్రాజెక్ట్ సాధనపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ముఖ్య కార్యకర్తలకు పార్టీ ఏమీ చేయలేకపోయిందన్న అసంతృప్తి ఉంది. దీన్ని కూడా సమావేశంలో చర్చించవ్చని పార్టీ నేతలు అంటున్నారు. మొత్తంమీద ఈ మహానాడులో 24 తీర్మానాలను ఆమోదించనున్నారు.
కాగా, సమావేశానికి 30 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఏపీ నుంచి 13,500 మంది, తెలంగాణ నుంచి 3,500 మంది, ఇతర రాష్ట్రాలు, ఎన్నారైలు సుమారు 10 వేల మంది వరకూ హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహానాడుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ భోజన, వసతి సౌకర్యాలు కల్పించినట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలియచేశారు.
chitram...
మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు తెలుగు మహిళల రిహార్సల్స్