రాష్ట్రీయం

దర్శకుడు దాసరి కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 30: ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు (75) కన్నుమూశారు. వారం రోజులుగా కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం రాత్రి 7 గంటలకు తుది శ్వాస విడిచారు. సినీ, రాజకీయ రంగాలతో పాటు పత్రికారంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్న దాసరి మృతిపట్ల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, తెలంగాణ సిఎం కె చంద్రశేఖరరావు, ఎపి సిఎం చంద్రబాబునాయుడు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతోపాటు సినీ పరిశ్రమకు చెందిన అనేకమంది తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. దాసరి కన్నుమూసిన వార్త తెలుసుకుని ఆస్పత్రికి చేరుకున్న దాసరి ప్రియ శిష్యుడు మోహన్‌బాబు కన్నీరుమున్నీరయ్యారు. మరో నిర్మాత సి కళ్యాణ్ వైద్యులు అధికారిక ప్రకటన చేయకముందే ఆస్పత్రి బయటకు వచ్చి ‘గురువుగారు ఇక లేరు, కాసేపట్లో ఆయన మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్తున్నాం...’అంటూ కన్నీటిపర్యంతమై చెప్పారు.
నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
దాసరి పార్ధీవ దేహానికి బుధవారం సాయంత్రం అంతిమ సంస్కారం నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. దాసరి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. చెవెళ్ల సమీపంలోని ఫాంహౌస్‌లో దాసరి అంత్యక్రియలు జరుగుతాయి. దాసరి మృతికి సంతాపంగా బుధవారం సినిమా షూటింగ్‌లు నిలిపివేయనున్నారు. అదేవిధంగా సినిమా హాళ్లను మూసివేయాలని నిర్ణయించారు. మంగళవారం రాత్రి 9.30కి దాసరి మృతదేహాన్ని కిమ్స్ నుండి నివాస గృహానికి తరలించారు. దాంతో ఆయన ఆత్మీయులు తండోపతండాలుగా నివాస గృహానికి చేరుకుని నివాళులు అర్పించారు.
కెసిఆర్, చంద్రబాబు సంతాపం
దాసరి నారాయణరావు సినిమా రంగంలో ఎంతో మందికి దారి చూపారని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. సినీ దర్శకులు, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు మృతికి కెసిఆర్ సంతాపం తెలిపారు. దాసరి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన్ని ఓ దీపస్తంభంగా అభివర్ణించారు. దాసరి మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించిందని గవర్నర్ నరసింహన్ అన్నారు.వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ఒక ప్రకటనలో దాసరి మృతికి సంతాపం తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ రోశయ్య దాసరి మృతిపై సంతాపం తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయిందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దాసరి మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. చైనాలో ఉన్న చిరంజీవి, మోహన్‌బాబు ప్రభృతులు దాసరితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దాసరి నారాయణరావు మృతి పట్ల కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు, తెలంగాణ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్, శాసనసభాపక్ష నేత జి కిషన్‌రెడ్డి, కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, సిపిఐ సీనియర్ నేత నారాయణ వేర్వేరు ప్రకటనల్లో సంతాపాన్ని వ్యక్తం చేశారు.