ఆంధ్రప్రదేశ్‌

హోదా ఎలా ప్రగతి నిరోధకం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్భ్రావృద్ధికి ప్రత్యేక హోదాను కోరేవారిని ప్రగతి నిరోధకులుగా అభివర్ణిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అసలు హోదా ఏవిధంగా ప్రగతి నిరోధకమో ప్రజలకు వివరించాలని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ గుంటూరులో ఏర్పాటు చేసిన సభకు ఎవరూ వెళ్లవద్దని చెప్పడం చంద్రబాబు కుసంస్కారానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రగతికి పాటుపడుతున్నామని చెప్పుకుంటున్న టిడిపిలో ఎమ్మెల్యేలు, ఎంపిలు ఇసుక మాఫియాలను ప్రోత్సహిస్తూ అధికారులపై దాడులు చేయడమే ప్రగతి అనుకుంటున్నారా? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా కల్లబొల్లి మాటలు కట్టిపెట్టి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ వెలుపల ఒత్తిడి పెంచేందుకు కృషి చేయాలని చంద్రబాబుకు హితవు పలికారు. విజయవాడలోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు డి రాజా, రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణతో కలిసి సుధాకరరెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బిజెపితో జతకట్టామని చెబుతున్న చంద్రబాబు ఇప్పటివరకూ చేకూరిన ప్రయోజనాలేమిటో వెల్లడించాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని, దాని స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే చంద్రబాబు అంగీకరించటం దారుణమన్నారు. చంద్రబాబు కేవలం ఎన్నికల్లో గెలిచేందుకు, తనపై కేసులు లేకుండా చూసుకునేందుకే బిజెపితో అవకాశవాద పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. తాను సంతకం చేయడం వల్లే తెలంగాణ వచ్చిందని హైదరాబాద్‌లో మాట్లాడటం, నవ్యాంధ్రలో జూన్ 2ను బ్లాక్‌డేగా నిర్వహించాలని, రాష్ట్రాన్ని అశాస్ర్తియంగా విడదీశారని చెప్పడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం పశువధపై నిషేధం విధించడం వల్ల లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు స్తంభించిపోతాయని సురవరం అన్నారు. వధశాలలకు తరలించకుండా ఉంటే కోట్లాది పశువుల ఆలనాపాలనా ఎవరు చూస్తారని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. డెయిరీలతో పాటు తోలు పరిశ్రమలు పూర్తిగా దెబ్బతింటాయన్నారు. ఇప్పటికే చాలా నష్టం జరిగిందని, చర్చల ద్వారానే రాజకీయ పరిష్కారాన్ని చూపాల్సిన అవసరం ఉందని సురవరం స్పష్టం చేశారు.
ఆందోళనకరంగా నిరుద్యోగ సమస్య
మూడేళ్ల పాలనలో ప్రధాని నరేంద్ర మోదీ చేసింది శూన్యమని సిపిఐ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు డి రాజా విమర్శించారు. ఎన్నికల సందర్భంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదన్నారు. ఏటా 2కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన ఆయన అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను ఊడతీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న నిరుద్యోగుల సంఖ్య ఆందోళన కలిగిస్తోందన్నారు. ముఖ్యంగా ఐటీ రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందన్నారు. ఫాసిస్టు మతోన్మాద శక్తుల ఆగడాలకు చెక్ చెప్పేందుకు సెక్యులర్ భావాలు కలిగిన పార్టీలతో వామపక్షాలు కలిసి రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. రాష్టప్రతి ఎన్నికల విషయమై ఇటీవల 17 రాజకీయ పార్టీలు సమావేశమై చర్చించాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే, లౌకిక, సెక్యులర్ భావాలను కలిగిన అభ్యర్థిని రాష్టప్రతి అభ్యర్థిగా నిలబెడతామని రాజా వివరించారు.