ఆంధ్రప్రదేశ్‌

పోస్టర్ రహిత పట్టణాలే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 4: రాష్ట్రంలో అన్ని పట్టణాలను పోస్టర్ రహితంగా తయారుచేయాలని, దీనికోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఆదివారం అన్ని పట్టణాల కమిషనర్లు, చైర్మన్లు, శాఖాధిపతులతో టెలికాన్ఫరెన్స్‌లో ఈ అంశాన్ని చర్చించారు. అనంతరం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. జూన్ 5న పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లోని ప్రభుత్వ భవనాలు, రోడ్ల మధ్య డివైడర్లపై ఎలాంటి కరపత్రాలు గాని, ఏవైనా రాతలు గాని రాయడానికి వీలులేదని, ఇది చట్టరీత్యా నేరమని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. జూన్ 5 తర్వాత ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఫ్లెక్సీలు, బ్యానర్లు కూడా ఆయా మున్సిపాలిటీల అనుమతి తీసుకుని మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. ప్రైవేట్ భవనాలపై కూడా వారి అనుమతి లేనిదే పోస్టర్లు, రాతలు రాయడం నేరమని, దీన్ని అందరూ దృష్టిలో ఉంచుకోవాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక డ్రైవ్ ద్వారా రేపటి పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రారంభించనున్నట్టు మంత్రి నారాయణ చెప్పారు. ఈ డ్రైవ్ ప్రతి మున్సిపాలిటీలో సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుందని, నెల్లూరు పట్టణంలో స్వయంగా తానే పాల్గొని అన్ని పోస్టర్లను తొలగిస్తామని మంత్రి చెప్పారు. అన్ని పట్టణాల్లో పోస్టర్లు తొలగించే కార్యక్రమం పది రోజుల్లో పూర్తవుతుందని చెప్పిన మంత్రి, అనంతరం రోడ్ల మధ్య డివైడర్లను, ప్రభుత్వ భవనాల గోడలను సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపడతామని తెలిపారు. స్వచ్ఛాంధ్ర పరిపూర్ణంగా సాధించే క్రమంలో ముఖ్యమంత్రి ఆదేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్టు మంత్రి వెల్లడించారు.