ఆంధ్రప్రదేశ్‌

కేసును స్వయంగా పరిశీలించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 10: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఇటీవల జరిగిన హత్యాయత్నం కేసును స్వయంగా పరిశీలించాలంటూ ఆ జిల్లా ఇన్‌చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును శనివారం విజయవాడలో ఆ నియోజకవర్గానికి చెందిన 200 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కోరారు. ప్రజలకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం కలిగేలా చేసి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు సరైన పోలీస్ రక్షణ కల్పించవల్సిందిగా మంత్రి పుల్లారావుని కోరారు. ఈ మధ్యకాలంలో ఏలూరు నగరంలో జరుగుతున్న హత్యలతో రోడ్డుపై ఒంటరిగా తిరిగే పరిస్థితి లేదన్నారు. మాజీ ఎంపిపి భర్త రెడ్డి అప్పలనాయుడు సరెండర్ అరెస్టు కూడా సహేతుకంగా జరగలేదని మంత్రికి విన్నవించారు. హత్యాప్రయత్నంపై పోలీసులు, రాజకీయ నాయకులు వ్యవహరించిన తీరు సగటు మనిషికి వ్యవస్థపై నమ్మకం కోల్పోయే విధంగా ఉందన్నారు. ఇదే పరిస్థితులు పునరావృతమైనట్లయితే ప్రజల నుండి తీవ్రమైన తిరుగుబాటు వచ్చే పరిస్థితులు ఉన్నందున ఈ సంఘటనపై స్పందించాలని మంత్రి పుల్లారావును కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి హత్యాప్రయత్నంపై తగిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చూస్తానని వారికి హామీ ఇచ్చారు.