ఆంధ్రప్రదేశ్‌

ఓఎన్జీసీ పైపులైన్ నుండి గ్యాస్ లీక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం,జూన్ 11: తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో ఒఎన్‌జిసి పైపులైన్లు ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఆదివారం అమలాపురం రూరల్ మండలం తాండవపల్లిలో గల ఒఎన్‌జిసి పైపులైను పగిలి పెద్దఎత్తున గ్యాస్ లీకవడంతో సమీప ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులుతీశారు. వివరాలిలా ఉన్నాయి. మురుగు కాలువల ఆధునికీకరణలో భాగంగా తాండవపల్లిలోని గేదెలకోడు డ్రైనులో పూడికతీత పనులను గత నాలుగు రోజులుగా జెసిబితో నిర్వహిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో జెసిబితోమట్టిని తీస్తుండగా పైపులైనుకు పగిలిపోయింది. దీంతో పెద్దఎత్తున గ్యాస్ లీకై భారీగా శబ్దాలు రావడంతో చుట్టుపక్కల ప్రజలు భయంతో పరుగులుతీశారు. విషయం తెలుసుకున్న అమలాపురం ఆర్డీవో జి గణేష్‌కుమార్, తహసీల్దారు బి బేబిజ్ఞానాంబ, ఆర్‌ఐ కె రాంబాబు సంఘటనా స్థలానికి చేరుకుని ఒఎన్‌జిసి అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన ఒఎన్‌జిసి అధికారులు గ్యాస్‌ను అదుపుచేసి పైపులైనుకు మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ఈ పైపులైను ద్వారా రంగాపురం నుండి ఓడలరేవుజిసియస్‌కు గ్యాస్ సరఫరా అవుతున్నట్లు అధికారులు తెలిపారు. అమలాపురం రూరల్ ఎస్‌ఐ ఎం గజేంద్రకుమార్, నీటి సంఘం అధ్యక్షులు జంపన రామరాజు, తాండవపల్లి, వనె్న చింతలపూడి సర్పంచులు సంఘటాన స్థలానికి వెళ్ళి పరిశీలించారు.