ఆంధ్రప్రదేశ్‌

కాపులను బీసీల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 11: త్వరలో మంజునాథ్ కమిషన్ నివేదిక అందనుందని, నివేదిక వచ్చిన వెంటనే కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ కేంద్రానికి ప్రభుత్వపరంగా ప్రతిపాదిస్తామని రాష్ట్ర డిప్యూటీ సిఎం, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం మోరంపూడిలోని బార్లపూడి రవికుమార్ ఫంక్షన్ హాలులో ఆదివారం కాపు వెల్ఫేర్.కామ్ మొబైల్ యాప్‌ను డిప్యూటీ సిఎం చినరాజప్ప ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కాపుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కూడా కృషి చేస్తోందన్నారు. ముఫ్పై ఏళ్లుగా ఎంతోమంది కృషిచేస్తున్నప్పటికీ జరగని పని ఆరు నెలలు లేదా ఏడాది లోగా ప్రభుత్వం కాపులకు బీసీల రిజర్వేషన్లు కల్పించనుందన్నారు. కాపుల ఉన్నతిని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కాపు కార్పొరేషన్ ఏర్పాటుచేసి, ఏడాదికి రూ.1000 కోట్లు బడ్జెట్ కేటాయించారన్నారు. దీంతో ఎంతోమంది కాపు యువత విదేశాల్లో చదువుకుంటున్నారన్నారు. కాపుల రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే సర్వే చేసిందన్నారు. కమిషన్ రిపోర్టు వచ్చిన వెంటనే కేంద్రానికి ప్రతిపాదిస్తామన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఎన్నో సంస్థలు కాపు యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నాయని, నేడు ఉద్యోగాలు పొందే యువతే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. సామాన్య స్థితి నుంచి సామాజిక అండతో తాను ఈ స్థితికి వచ్చానన్నారు. ఒక కార్యకర్తగా కాపు సామాజికవర్గ ఉన్నతికి కృషి చేస్తానని, అభివృద్ధిచెందిన వారిని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత స్థితికి ఎదగాలన్నారు. ముద్రగడ పద్మనాభం ముఫ్పై ఏళ్లుగా కాపు జాతి కోసం కృషి చేస్తున్నారని, రానున్న ఆరు నెలల్లోనే రిజర్వేషన్లు సాధించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును తిడితే పనిజరగదని, వెనక్కి తగ్గితే నష్టం ఎవరికి జరుగుతుందో అర్ధం చేసుకోవాలన్నారు. కాపు సామాజికవర్గంలో ఎంతోమంది ఐఎఎస్, ఐపిఎస్‌లు రావాలని, ప్రభుత్వ సహకారం లేకుండా ఏదీ సాధించలేమన్నారు. కాపులకు ప్రత్యేకించి జాబ్ మేళా నిర్వహించి ప్రభుత్వం విశేషత చాటుకుందని, త్వరలో మరో జాబ్ మేళా నిర్వహించనున్నామని చిన రాజప్ప ప్రకటించారు. మంచిచేసినా ప్రభుత్వాన్ని తిడుతూ వుంటే చేయడం మానేస్తారని, అలాచేస్తే నష్టపోయేది మనమేనని, వ్యక్తుల మాటలకు ప్రభావితం కాకుండా మంచీ చెడూ ఆలోచించి మంచిని ఆదరించాలని, చెడును ఖండించాలని పరోక్షంగా ముద్రగడను ఉద్దేశించి అన్నారు. మంజునాథ్ కమిషన్ నివేదిక వచ్చిన వెంటనే బీసీల్లో చేర్చాలని కేంద్రానికి నివేదిక వెళ్లనుందని చినరాజప్ప చెప్పారు. ఈ సమావేశంలో మేయర్ పంతం రజనీ శేషసాయి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ యర్రా వేణుగోపాలరాయుడు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఇటీవల మృతిచెందిన దాసరి నారాయణరావు, పి.శివశంకర్‌కు సమావేశం సంతాపం ప్రకటించింది.